ఎలుగుబంటి హల్‌చల్‌

Published: Sat, 25 Jun 2022 23:31:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
  ఎలుగుబంటి హల్‌చల్‌ ఎలుగుబంటిని పట్టుకోవడానికి సన్నాహాలు చేస్తున్న అటవీ సిబ్బంది (గుడిమెట్టలో సంచరిస్తున్న ఎలుగుబంటి)

భయాందోళనలో గ్రామస్థులు

పట్టుకోవడానికి శ్రమిస్తున్న అటవీ సిబ్బంది

రాచర్ల, జూన్‌ 25 : మండలంలోని గుడిమెట్ట గ్రామంలో ఎలుగుబంటి సంచరిస్తోంది.రెండురోజులుగా ఎలుగుబంటి అప్పుడప్పుడు గ్రామస్థులకు కనిపించడంతో వారు భయాందోళన చెందుతున్నారు. మౌళాలిస్వామి కొండ పక్కన ఈ ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాన్ని గ్రామస్తులు చూశారు. ఇటీవల తాటిచెర్లమోటులో సంచరిస్తున్న ఈ ఎలుగుబంటి అక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఎలుగుబంటిని చూసిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సిబ్బంది రంగంలోకి దిగారు. రేంజ్‌ అధికారి కుమార్‌రాజా, వీఆర్‌వో కొండలరావు, ఫారెస్టు బీట్‌అధికారి లక్ష్మీనాయక్‌తోపాటు మరో 8 మంది సిబ్బంది గుడిమెట్ట గ్రామంలోనే ఉండి ఎలుగుబంటి అడుగుజాడలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా బీట్‌ అధికారి లక్ష్మీనాయక్‌ మాట్లాడుతూ ఎలుగుబంటి గుడిమెట్ట ప్రాంతంలో సంచరించిన మాట వాస్తవమేనని, రెండు గ్రూపులుగా ఏర్పడి ఎలుగుబంటిని సురక్షితంగా పట్టుకునేందుకు పలుచర్యలు చేపట్టినట్లు తెలిపారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.