అందం.. ఆహ్లాదం

May 8 2021 @ 23:55PM

పెద్దేముల్‌: రోడ్డుపై వెళుతుంటే ఎన్నో ప్రకృతి అందాలు మనకు కనిపిస్తుంటాయి. కొన్నింటిని చూడగానే వావ్‌ అనిపిస్తుంది. అంతేకాదు అక్కడ కాసేపు నిలబడి ఆ అందాలను తనివితీరా చూడాలనిపిస్తుంది. అలాంటి అందాలే పెద్దేముల్‌ మండల కేంద్రం వద్ద చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పెద్దేముల్‌ మండల కేంద్రం సమీపంలోని రోడ్డుపైన చెట్లు అందంతో పాటు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. బాటసారులకు కనువిందుచేస్తున్నాయి. పెద్దేముల్‌ - తాండూరు రోడ్డులో పెద్దేముల్‌ సమీపంలోని పెట్రోల్‌బంక్‌ దాటగానే ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన ఇరువైపుల గల మంకెనపూల చెట్లు నిండుగా పువ్వులు పూయడంతో ఆ దారి వెంట వెళ్లే వారికి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఆ దారిలో ఎండలో వెళుతున్న వారు అక్కడి అందాలను చూస్తూ ఎంతో మురిసిపోతున్నారు. అంతేకాదు.. కాసేపు అక్కడ ఆగి ఆ చెట్ల కింద సేద తీరుతున్నారు. 


Follow Us on:

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.