బెడ్‌ ప్లీజ్‌!

ABN , First Publish Date - 2021-05-07T07:44:51+05:30 IST

రుయాలో రెకమండేషన్‌ ఉంటేనే బెడ్‌ దొరుకుతుందనే విమర్శలు పెరిగిపోతున్నాయి.

బెడ్‌ ప్లీజ్‌!

రుయాలో ఆక్సిజన్‌, 

వెంటిలేటర్‌ బెడ్ల కోసం పైరవీలు


తిరుపతి (వైద్యం), మే 6 : రుయాలో రెకమండేషన్‌ ఉంటేనే బెడ్‌ దొరుకుతుందనే విమర్శలు పెరిగిపోతున్నాయి. రుయాస్పత్రిలో 1050 బెడ్లున్నాయి. ఇందులో 876 ఆక్సిజన్‌ బెడ్లు, 135 వెంటిలేటర్‌ బెడ్లు ఉన్నాయి. ఇది జిల్లా కొవిడ్‌ ఆస్పత్రిగా సేవలందిస్తున్నా, కడప, నెల్లూరు జిల్లాల నుంచి కూడా వైద్య సేవల కోసం ఇక్కడికి వస్తుండటంతో అడ్మిషన్‌ దొరకడం జిల్లా వాసులకు గగనం అవుతోంది. అధికారుల లెక్కల ప్రకారం ఒక బెడ్‌కు ఐదుగురు వెయిటింగ్‌లో ఉంటున్నారు. ఒక్కో రోజు ఈ సంఖ్య పది దాకా ఉంటోంది. అయితే రుయాకు వచ్చేవారు పరిస్థితి ముదిరాకే వస్తున్నారు. ముందుగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరి, చికిత్స తీసుకుని, అక్కడ డబ్బులు చెల్లించలేక, వ్యాధి తీవ్రత ఎక్కువై ఆఖరి నిమిషంలో రుయాస్పత్రికి పరుగులు తీస్తున్నారు. దీంతో అందరికీ అత్యవసర వైద్యం అవసరం అవుతోంది.   ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ బెడ్ల కోసం  పైరవీలు చేయించాల్సి వస్తోం ది.పేషెంట్లను ఆస్పత్రి బయట కార్లలో పెట్టుకుని, బెడ్ల కోసం తెలిసిన అధికారుల చుట్టూ ప్రదక్షిణ లు చేయాల్సి వస్తోంది. వాస్తవంగా బెడ్లు లేవని అధికారులు వివరించినా, విన డం లేదు. ప్రజాప్రతినిధులతో  ఫోన్‌ చేయిస్తున్నారు. బెడ్‌లు ఖాళీ లేక ఏ ఫోన్‌ వచ్చినా అధికారు లు హడలిపోతున్నారు.దృష్టి అంతా అడ్మిషన్ల మీదే పె ట్టాల్సి రావడంతో వైద్య సేవల పర్యవేక్షణ సన్నగిల్లుతోంది.  

Updated Date - 2021-05-07T07:44:51+05:30 IST