ఇవి బెడ్‌టైమ్‌ స్నాక్స్‌!

ABN , First Publish Date - 2021-03-29T06:26:46+05:30 IST

తేలికగా ఉండి పోషకాలతో నిండిన స్నాక్స్‌ను రాత్రిపూట తక్కువ మొత్తంలో తినాలి. దాంతో నిద్రపోయే సమయంలో జీవక్రియలు సవ్యంగా జరిగేందుకు అవసరమైన శక్తి లభిస్తుంది...

ఇవి బెడ్‌టైమ్‌ స్నాక్స్‌!

తేలికగా ఉండి పోషకాలతో నిండిన స్నాక్స్‌ను రాత్రిపూట తక్కువ మొత్తంలో తినాలి. దాంతో నిద్రపోయే సమయంలో జీవక్రియలు సవ్యంగా జరిగేందుకు అవసరమైన శక్తి లభిస్తుంది. అర్థరాత్రిళ్లు ఆకలి వేయదు. అయితే ప్రొటీన్లు, ఫైబర్‌, కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉండే స్నాక్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చేస్తే తొందరగా బరువు తగ్గుతారు కూడా. 


  1. అరటిపండు: తేలికగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్స్‌ ఉన్న అరటిపండు రాత్రిపూట తినదగ్గది. నిద్రపోయే ముందు అరటి పండు తింటే జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. జీర్ణక్రియ వేగంగా జరిగితే బరువు పెరగకుండా ఉంటారు. 
  2. కీరదోస: బరువు తగ్గాలనుకునే వారికి కీరదోస మంచి ఆప్షన్‌. సన్నగా తరిగిన కీరదోస ముక్కలను సెనగలతో చేసిన చట్నీలో అద్దుకుంటూ తినాలి. ఈ చట్నీలో బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రొటీన్లు, ఫ్యాట్స్‌, కార్బోహైడ్రేట్‌ల జీవక్రియలను వేగవంతం చేస్తాయి. 
  3. యోగర్ట్‌, పండ్లు: యాపిల్‌, ద్రాక్ష, స్ట్రాబెర్రీ లేదా అరటిపండును యోగర్ట్‌లో చేర్చుకొని తింటే కావల్సినంత శక్తి వస్తుంది.  చక్కగా నిద్ర పడుతుంది. 
  4. పీనట్‌ బటర్‌ టోస్ట్‌: ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే పీనట్‌ బటర్‌ టోస్ట్‌ను రాత్రిపూట స్నాక్‌గా తింటే అర్థరాత్రిళ్లు ఆకలి వేయదు.

Updated Date - 2021-03-29T06:26:46+05:30 IST