అవసరమైన పడకలున్నాయ్‌.. వైద్యసేవలూ అందిస్తున్నామ్‌!

May 8 2021 @ 23:13PM

కలెక్టర్‌ చక్రధర్‌బాబు వెల్లడి


నెల్లూరు (వైద్యం), మే 8 : కరోనా బాధితులకు అవసరమైన పడకలు, వైద్యసేవలు అందిస్తున్నట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 38 కొవిడ్‌ ఆసుపత్రులలో 2751 పడకలు ఉన్నాయని పేర్కొన్నారు. అందులో ఆక్సిజన్‌ పడకలు 1343 ఉండగా శనివారానికి 1303 నిండి ఉన్నాయన్నారు. 111 ఐసీయూ పడకలకు 104, 1076 సాధారణ పడకలకు 462 నిండి ఉన్నట్లు తెలిపారు. వెంటిలేటర్లు సదుపాయం ఉన్న పడకలు 221కు గాను 221 నిండి ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని 8 కొవిడ్‌ కేర్‌ సెంటర్ల 3240 పడకలు ఉండగా, 884 పడకలు మాత్రమే నిండి ఉన్నాయన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న 1122 మంది కరోనా బాధితులకు మందుల కిట్లు అందించామని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు హోం క్వారంటైన్‌లో 36,325 మందిని వైద్యాధికారులు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు సందర్శించి సలహాలు సూచనలు చేశారన్నారు. జిల్లాలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 1564 మంది వైద్యులు, స్పెషలి్‌స్టలు, పారామెడికల్‌ సిబ్బంది, నాల్గవ తరగతి సిబ్బంది పని చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం నాటికి 572 రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉండగా 386 డోసులు వినియోగించినట్లు పేర్కొన్నారు. అలాగే అందుబాటులో ఉన్న 40 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌కు 36 మెట్రిక్‌ టన్నులను వినియోగించినట్లు తెలిపారు. 


ఆక్సిజన్‌ ప్లాంట్ల పరిశీలన


కోవూరు : మండల పరిధిలోని ఇనమడుగు, పోతిరెడ్డిపాళెం గ్రామాల్లోని ప్రైవేటు ఆక్సిజన్‌ సిలిండర్ల తయారీ కేంద్రాలను కలెక్టర్‌ చక్రధరబాబు శనివారం పరిశీలించారు. ఆక్సిజన్‌ ఎంత ఉత్పత్తి అవుతోందో యజమానులను అడిగి తెలుసుకున్నారు. ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ మొత్తాన్ని కొవిడ్‌ సెంటర్లకే సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ ఆసుపత్రులు, కొవిడ్‌ సెంటర్లలో  ఆక్సిజన్‌ కొరత లేకుండా నిరంతరం సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట  జేసీ బాపిరెడ్డి ఉన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.