షాట్ అండ్ ఎ బీర్... కరోనా టీకా విషయంలో అక్కడ అలా....

ABN , First Publish Date - 2021-05-07T23:06:30+05:30 IST

కరోనా టీకా విషయంలో అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. ఈ క్రమంలో... ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తాం.. రండి బాబూ రండి అంటున్నా ప్రజలు ముందుకు రావడం లేదు.

షాట్ అండ్ ఎ బీర్... కరోనా టీకా విషయంలో అక్కడ అలా....

న్యూజెర్సీ : కరోనా టీకా విషయంలో అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. ఈ క్రమంలో... ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తాం.. రండి బాబూ రండి అంటున్నా ప్రజలు ముందుకు రావడం లేదు. అందులోనూ అమెరికాలో టీకా కార్యక్రమం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. దీంతో ప్రభుత్వం వ్యాపార సంస్థలతో జత కట్టింది. ఈ క్రమంలో... ‘టీకా వేయించుకుంటే ఫ్రీగా బీర్లు ఇస్తాం.. డోనట్స్ ఇస్తాం.. సేవింగ్స్ బాండ్స్ ఇస్తాం’ అంటూ ప్రచారం చేస్తున్నారు కూడా. అయినా పెద్దగా ఫలితం కనబడకపోవడం విశేషం. 


ఈ క్రమంలో... న్యూజెర్సీలో, గవర్నర్ ఫిల్ మర్ఫీ టీకాలను ప్రోత్సహించడానికి ‘షాట్ అండ్ ఎ బీర్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘మే నెలలో మొదటి టీకా మోతాదును పొంది, సదరు టీకా కార్డును న్యూజెర్సీలో ఏ మందు దుకాణానికి వెళ్ళినా ఉచిత బీరు లభిస్తుంది’ అని మర్ఫీ ట్వీట్ చేశారు. అమెరికాలో చట్టబద్దమైన మద్యపాన వయస్సు 21 ఏళ్లు పైబడిన “గార్డెన్ స్టేట్” నివాసితులకు మాత్రమే ఈ ఆఫర్ అందిస్తున్నారు.


Updated Date - 2021-05-07T23:06:30+05:30 IST