వంటలు

బీట్‌రూట్ పెరుగు చట్నీ

బీట్‌రూట్ పెరుగు చట్నీ

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌ తరుగు - 2 కప్పులు, పెరుగు - ఒకటిన్నర కప్పులు, ఉల్లితరుగు - అరకప్పు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 4 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు - 4 టీ స్పూన్లు, పచ్చిమిర్చి - 1, కరివేపాకు - 8 రెబ్బలు, పచ్చికొబ్బరి తురుము - పావు కప్పు, అల్లం - పావు అంగుళం ముక్క, ఎండుమిర్చి - 2.


తయారుచేసే విధానం: మిక్సీలో పచ్చికొబ్బరి, 2 టీ స్పూన్ల ఆవాలు, అల్లం ముక్క వేసి పేస్టు చేసి పక్కనుంచాలి. కడాయిలో 2 టీ స్పూన్లు నూనె వేసి మిగిలిన ఆవాలు వేగించి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, 4 కరివేపాకు రెబ్బలు వేయాలి. అన్నీ వేగాక బీట్‌రూట్‌ తురుము వేసి వేగించాలి. ఇప్పుడు పచ్చికొబ్బరి మిశ్రమం వేసి బాగా కలపాలి. తర్వాత గిలకొట్టిన పెరుగులో బీట్‌రూట్‌ మిశ్రమం కలిపి పైనుండి ఎండుమిర్చి, కరివేపాకుతో పెట్టిన తాలింపు వేయాలి.

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.