
బాలీవుడ్ సెలెబ్రిటీలందరూ దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్నారు. అలియా భట్- రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ త్వరలోనే పెళ్లి పీటలకు ఎక్కబోతున్నారని వారి సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి. కాబోయే కోడలికి వివాహనికి ముందుగానే ఖరీదైన బహుమతులు పంపిచడం అనే అనవాయితీ భారత్‌లో ఎన్నో రోజులుగా ఉంది. ఈ సంప్రదాయన్ని అనుసరిస్తూ విక్కీ కౌశల్ తల్లి వీణా కౌశల్ కత్రినా కైఫ్‌కు ఖరీదైన బహుమతులు పంపిచినట్లుగా తెలుస్తోంది.
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌లు డిసెంబర్ మొదటి వారంలో రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో ఉన్న సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ‘‘ విక్కీ కౌశల్ తల్లి వీణా కౌశల్ సొంతంగా షాపింగ్ చేసి కోడలుకు పంపించే వస్తువులను కొనుగోలు చేసింది. ఒక సారి పెళ్లికి ముహుర్తం పెట్టుకోగానే ఇరు కుటుంబాల వారు బహుమతులను ఇచ్చి పుచ్చుకోవడం అనే సంప్రదాయం భారత్‌లో ఎన్నాళ్లగానో కొనసాగుతోంది. ఆ సంప్రదాయాన్ని అనుసరించే విక్కీ తల్లి కాబోయే కోడలుకు బహుమతులు పంపినట్టు తెలుస్తోంది. చేతితో తయారు చేసిన డార్క్ చాక్లెట్లతో పాటు మిఠాయిలు, చీరలు, బంగారు నగలను గిఫ్ట్‌గా ఆమె పంపించింది ’’ అని విక్కీ కౌశల్ కుటుంబానికి సన్నితంగా మెలిగే ఒక వ్యక్తి చెప్పారు.
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ తాము ప్రేమించుకుంటున్నామని గాని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని గాని బహిరంగంగా ఎక్కడ ప్రకటించలేదు. ఆర్తి శెట్టి ఇచ్చిన దీపావళి పార్టీలో వీరిద్దరూ కలిసి కనిపించారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.