ఫేస్‌బుక్‌లో పరిచయం..ఆమె అతడి మాయలో పడిపోయింది. ఇదంతా ప్రేమే అనుకుంది. అతడు కోరినట్టే చేసింది.. చివరికి..

Sep 19 2021 @ 17:26PM

ఇంటర్నట్ డెస్క్: ఫేస్‌బుక్‌లో పరిచయం.. అతడేమో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఆమెమో ఇంకా పదవతరగతే. కానీ.. ఆమె అతడి మాటల మాయలో పడిపోయింది. ఇదంతా ప్రేమే అనుకుంది.  అతడే తన లోకం అనే స్థితికి ఆమె చేరుకుంది. ఈ క్రమంలో అతడు ఒకరోజు హటాత్తుగా ఆమె ముందు వాలిపోయాడు. అతడిని చూడగానే ఆమె సంబరపడిపోయింది. మరో ఆలోచన లేకుండా అతడి వెంట నడిచింది. ఆ నిర్ణయమే ఆమె జీవితాన్ని ఊహించిన మలుపు తిరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుభమ్ ఆగ్రాలో నివసిస్తూ పోటీ పరీక్షలను ప్రిప్రేర్ అవున్నాడు. కొద్ది నెలల క్రితం అతడికి ఫేస్‌బుక్‌లో ఓ బాలిక పరిచయమైంది. ఆ తరువాత.. వారు మరింత దగ్గరయ్యారు. నిత్యం ఒకరితో ఒకరు చాటింగ్ చేస్తూ రోజులు క్షణాల్లా గడిపేసేవారు. అయితే.. ఆమె ఉండేది రాజస్థాన్‌లోని జైపూర్. శుభమ్ ఉండేది ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో. అతడు ఎప్పుడూ జైపూర్‌కు వెళ్లింది లేదు. దీంతో.. గూగుల్ మ్యాప్ సాయంతో అతడు జులై 15న జైపూర్‌కు వెళ్లి ఆమెను కలుసుకున్నాడు. తన కోసం అంత దూరం నుంచి వచ్చిన శుభమ్‌ను చూడగానే ఆమె సంబరపడిపోయింది. 

ఇవీ చదవండి:

బాలుడి బ్యాంకు ఖాతాలో రూ. 905కోట్లు..తండ్రి మైండ్ బ్లాంక్!

రాత్రి వేరువేరుగా పడుకున్నారు.. తెల్లవార్జామున భార్య గదిలోకి వెళితే..

ఇదే అదనుగా శుభమ్.. ఎక్కడికైనా వెళ్లిపోదాం అంటూ ఆమె ముందు హటాత్తుగా ఓ ప్రతిపాదన తెచ్చాడు. ఆమె ముందూవెనుకా ఆలోచించకుండా శుభమ్ కోరినట్టే.. అతడి వెంట వెళ్లేందుకు అంగీకరించింది. ఆ తరువాత.. ఆమెను తీసుకుని శుభమ్ ఆగ్రాకు చేరుకున్నాడు. అక్కడ ఒక అద్దె ఇంట్లో వారు దిగారు. ఈ క్రమంలో ఆమెకు మాయమాటలతో మభ్యపెట్టి లోబరుచుకున్నాడు. శారీరకంగా దగ్గరయ్యాడు. మరోవైపు..బాలిక అదృశ్యమవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీని జల్లెడపట్టిన పోలీసులు శుభమ్ ఆచూకీ  గుర్తించారు. సెప్టెంబర్ 15న ఆగ్రాకు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై అత్యాచారం నేరం కింద కేసు నమోదు చేశారు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.