ఈ Beggar కళ్లల్లో ఎంత ఆనందమో చూడండి.. భార్య కోసం రూ.90 వేలతో మోపెడ్ కొనేందుకు ఎంతగా కష్టపడ్డాడంటే..

ABN , First Publish Date - 2022-05-23T22:58:29+05:30 IST

రోజూ భిక్షాటన(Begging) చేయనిదే ఆ భార్యభర్తలకు పూట గడవదు. అలాంటి పరిస్థితుల్లోనూ అతడు తన భార్య కళ్లల్లో సంతోషాన్ని చూడాలనుకున్నాడు. ఆమె కష్టాన్ని తీర్చేందుకు ద్విచక్ర వాహానాన్ని కొను

ఈ Beggar కళ్లల్లో ఎంత ఆనందమో చూడండి.. భార్య కోసం రూ.90 వేలతో మోపెడ్ కొనేందుకు ఎంతగా కష్టపడ్డాడంటే..

ఇంటర్నెట్ డెస్క్: రోజూ భిక్షాటన(Begging) చేయనిదే ఆ భార్యభర్తలకు పూట గడవదు. అలాంటి పరిస్థితుల్లోనూ అతడు తన భార్య కళ్లల్లో సంతోషాన్ని చూడాలనుకున్నాడు. ఆమె కష్టాన్ని తీర్చేందుకు ద్విచక్ర వాహానాన్ని కొనుగోలు చేయాలనుకున్నాడు. చివరకి అనుకున్నది సాధించాడు. రూ.90వేలతో మోపెడ్‌ను కొనుగోలు చేసి, భార్యతో సహా దానిపై ప్రయాణం చేశాడు. ఈ క్రమంలో ఆమె ముఖంలో చిరునవ్వు చూసి, అతడి కళ్లు సంతోషంతో నిండిపోయాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని చింద్వారా‌కు చెందిన సంతోష్ సాహూ(Santosh Sahu).. నడవలేడు. పొట్టకూటి కోసం భార్య సహాయంతో ట్రైసైకిల్‌పై పలు ప్రాంతాలకు వెళ్తూ అతడు భిక్షాటన చేస్తాడు. తాను ట్రైసైకిల్‌పై కూర్చుంటే.. అతడి భార్య దాన్ని తోస్తూ ఉండేది. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల గతుకుల రోడ్లు, ఇతర వాతావరణ కారణాల వల్ల ఆమె అప్పుడప్పుడూ జబ్బు పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో భార్య ఇబ్బందులను అర్థం చేసుకున్న Santosh Sahu.. ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి ఆమెకు గిఫ్ట్‌గా ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి రోజూ కొంత మొత్తాన్ని పక్కన పెడుతూ.. తాజాగా రూ.90వేలతో మోపెడ్‌ను కొనుగోలు చేశాడు. దీంతో అతడి భార్య సంతోషం వ్యక్తం చేసింది. ఆమె ముఖంలోని చిరునవ్వు చూసి.. సంతోష్ సాహూ కళ్లు వెలిగిపోయాయి. ప్రస్తుతం సంతోష్ సాహూ అతడి భార్య మోపెడ్‌పై పలు ప్రాంతాలకు ప్రయాణిస్తూ Begging చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Updated Date - 2022-05-23T22:58:29+05:30 IST