సమిధలవుతున్న.. పసిమొగ్గలు

ABN , First Publish Date - 2022-05-23T05:40:57+05:30 IST

సమిధలవుతున్న.. పసిమొగ్గలు

సమిధలవుతున్న.. పసిమొగ్గలు
ఎర్రటి ఎండలో పసిమొగ్గలతో భిక్షాటన చేస్తున్న మహిళలు

శ్రీవారి క్షేత్రం అడ్డా..
క్షేత్రానికి భారీగా భక్తులు వస్తారని..పాత బస్టాండ్‌, ఆలయ పార్కింగ్‌ ప్రదేశం, ముఖ్య కూడళ్లు, శివాలయం ప్రాంతాల్లో చిన్నపిల్లలను మెడకు కట్టుకుని సంచరిస్తూ కొందరు మహిళలు భిక్షాటన చేస్తున్నారు. మండుతున్న ఎండలకు పెద్దవాళ్లే బయటకు వచ్చేందుకు జంకుతుంటే.. వారు పసికందులతో మిట్టమధ్యాహ్నం యాచిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.

పనిచేసే సత్తా ఉన్నా..
యాచకుల్లో 95 శాతం మంది కష్టపడే సత్తా ఉన్నవారే. తమతో ఉన్న బిడ్డలను కొందరు అద్దెకు తెస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలో వయసు మీరిన తర్వాత ఏ పనీ చేయలేని స్ధితిలో యాచకులుగా మారేవారు. కానీ వయసున్నా ఆరోగ్యం సహకరిస్తున్నా కొందరు పసిబిడ్డలను తమ కొంగుకు కట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తులు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో వారి వెంటబడి భిక్షాటన చేస్తున్నారు. ఓపక్క ఎండవేడిమిని తట్టుకోలేక చంటి బిడ్డలు నీరసించి తలలు వాల్చుతున్నా.. ఉక్కబోతతో గుక్కపెట్టి ఏడుస్తున్నా యాత్రికులు వేసే డబ్బు కోసం.. బిడ్డ పాలకోసం ఏడుస్తున్నాడు..సాయం చేయండయ్యా అంటూ చేయిచాస్తున్నారు.



శ్రీవారి క్షేత్రంలో పసిబిడ్డలతో భిక్షాటన
ఎండ వేడికి తాళలేక చిన్నారుల అవస్థలు
పట్టించుకోని అధికారులు

ద్వారకాతిరుమల, మే 22: పాలబుగ్గల పసిమొగ్గలు.. అమ్మ ఒడిలో సేదతీరాల్సిన పసికందులు ..యాచకుల సంపాదనకు సమిధులవుతున్నారు. కష్టపడే వయసు, సత్తువ ఉన్నా.. కొందరు పసిబిడ్డలను చంకనేసుకుని ..బిడ్డకు ఆకలితో ఏడుస్తున్నాడంటూ యాచిస్తున్నారు. చిన్నారులను అడ్డుపెట్టుకుని రోజుకు వందల్లో సం పాదిస్తున్నారు. ఎండనక...వాననక చిన్నారులను తమతో తిప్పుతున్నారు. ఎండ వేడికి తాళలేక చిన్నారులు అవస్థలు పడుతున్నారు.

Updated Date - 2022-05-23T05:40:57+05:30 IST