Advertisement

ప్రైవేట్‌ టీచర్లను ఆదుకోవాలని భిక్షాటన

Nov 29 2020 @ 00:05AM
భిక్షాటన చేస్తున్న ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు

సిద్దిపేట అర్బన్‌, నవంబరు 28: ప్రైవేట్‌ టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి అరవింద్‌ ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేటలో భిక్షాటన చేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా కాలంలో  ప్రైవేట్‌ టీచర్స్‌కి ఉపాధి లేక మానసిక ఒత్తిళ్లకు గురై ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ పట్టణ అధ్యక్షుడు కార్యదర్శి రాజు, సభ్యులు అరవింద్‌,  నవీన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


Follow Us on:
Advertisement