రీ సర్వే ప్రక్రియ ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-03T04:48:35+05:30 IST

శాశ్వత భూహక్కు కల్పించే లక్ష్యంతో చేపట్టిన రీ సర్వే ప్రక్రియను తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌ ప్రొద్దుటూరు మండలంలోని దొరసాని పల్లెలో గురువారం ప్రారం భించారు.

రీ సర్వే ప్రక్రియ ప్రారంభం
డ్రోన్‌ సర్వేలో తీసిన మ్యాప్‌లను పరిఽశీలిస్తున్న తహసీల్దారు సిబ్బంది

ప్రొద్దుటూరు అర్బన్‌ డిసెంబరు 2 : శాశ్వత భూహక్కు కల్పించే లక్ష్యంతో చేపట్టిన రీ సర్వే ప్రక్రియను తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌ ప్రొద్దుటూరు మండలంలోని దొరసాని పల్లెలో గురువారం ప్రారం భించారు. డ్రోన్‌ ప్లే ద్వారా తీసిన భూసర్వే మ్యాప్‌లను జమ్మలమడుగు డీఐ గురివిరెడ్డి, తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌ తో కలిసి పరిశీంచారు.ఆయన దొరసానిపల్లెలో విలేజ్‌ బౌండరీస్‌ వద్ద నుంచి రీ సర్వే చేపట్టారు. ఈ సర్వేలో మొదట ప్రభుత్వ భూములను గుర్తించి వాటి హద్దులు నిర్ణయిస్తామన్నారు. పట్టాభూములను  ఎంజాయిమెంటులో ఎవరున్నారన్నది గుర్తిస్తామని తహసీల్దారు తెలిపారు. గ్రామంలో మొత్తం ఎన్ని ఎకరాల భూ ములు వున్నది వాటి పూర్తి హద్దులు గుర్తించి వివాదాలకు తావులేకుండా శాశ్వత భూ హక్కును గుర్తించే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సుదర్శన్‌ విఆర్‌ఓలు విలేజ్‌ సర్వేయర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T04:48:35+05:30 IST