Begum Bazar పరువు హత్య కేసు ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2022-05-22T02:41:05+05:30 IST

బేగంబజార్ (Begum Bazar) పరువు హత్య కేసును పోలీసులు ఛేదించారు. నీరజ్‌ను హత్య చేసిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Begum Bazar పరువు హత్య కేసు ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌: బేగంబజార్ (Begum Bazar) పరువు హత్య కేసును పోలీసులు ఛేదించారు. నీరజ్‌ను హత్య చేసిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అభినందన యాదవ్, విజయ్ యాదవ్, సంజయ్ యాదవ్, రోహిత్ యాదవ్, మహేష్ యాదవ్‌ అరెస్ట్ చేశారు. హత్య నిందితుల్లో ఒక మైనర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. గతేడాది ఏప్రిల్‌లో సంజన, నీరజ్‌లు ఇంట్లోంచి వెళ్లిపోయి ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. నీరజ్‌పై ఎలాగైనా పగ తీర్చుకోవాలని చూసిన సంజన కుటుంబసభ్యులు అదునుకోసం ఎదురు చూశారు. కొద్దిరోజులుగా నీరజ్‌ను హతమార్చాలని పథకం వేశారు. ఐదుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. పక్క వీధిలో పల్లీల వ్యాపారం చేస్తున్న తన మామ వద్దకు శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో నీరజ్‌ వెళ్లాడు. స్కూటీపై తిరిగి వస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు రెండు బైక్‌లపై వెంబడించారు. నీరజ్‌ తన ఇంటి సమీపంలోకి రాగానే.. అతడి స్కూటీని ఢీ కొట్టారు. దాంతో అతడు కింద పడిపోయాడు. వెంటనే బైక్‌లు దిగిన దుండగులు కత్తులతో నీరజ్‌పై దాడిచేశారు. 20సార్లు విచక్షణా రహితంగా పొడిచారు. తర్వాత రాడ్లతో కొట్టారు. చనిపోయాడో లేదోననే అనుమానంతో అక్కడే ఉన్న గ్రానైట్‌ రాయిని నీరజ్‌పై ఎత్తేశారు. అతడు మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత రెండు బైక్‌లపై పారిపోయారు

Updated Date - 2022-05-22T02:41:05+05:30 IST