ఆ నవ్వు వెనుక బాధ ఎవరికి తెలుసు..!

ABN , First Publish Date - 2022-05-13T01:56:42+05:30 IST

పరుగులు సాధిస్తే పొగిడేస్తారు. ఫామ్ కోల్పోతే మాత్రం విమర్శకులు నోటికి పని చెబుతారు. ఇప్పుడు

ఆ నవ్వు వెనుక బాధ ఎవరికి తెలుసు..!

ముంబై: పరుగులు సాధిస్తే పొగిడేస్తారు. ఫామ్ కోల్పోతే మాత్రం విమర్శకులు నోటికి పని చెబుతారు. ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengalugu) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయంలోనూ అదే జరుగుతోంది. టన్నుల కొద్దీ పరుగులు చేసిన రికార్డులను అందరూ మరిచిపోతున్నారు. ఎవరైనా టఫ్ టైమ్‌ను ఫేస్ చేస్తున్నప్పుడు..వీలైతే నాలుగు మంచి మాటలు చెప్పాలి. సపోర్ట్‌గా నిలబడాలి. అయితే ఐపీఎల్‌లో పూర్ ఫామ్‌లో ఉన్న విరాట్‌పై మాత్రం బౌన్సర్ల వర్షమే కురుస్తోంది. ఐనా కింగ్ తన పని  తాను చేసుకుపోతున్నాడు. 


తన ప్రభావం జట్టు మీద పడకుండా చూసుకుంటున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ సహచర ప్లేయర్లను నవ్విస్తూ కనిపిస్తున్నాడు. ఎంత కష్టపడినా భారీ స్కోర్లు చేయలేకపోతున్నానన్న బాధ విరాట్‌లో కనిపిస్తోంది. ఆ బాధను మాత్రం బయటకు కనిపించనివ్వడం లేదు. టీమ్ మేట్స్ హుషారుగా ఉండేందుకు తనవంతుగా ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే చాలా మందికి కోహ్లీయే ఇన్‌స్పిరేషన్. ఫామ్‌లో లేనన్న బాధ విరాట్‌లో కనిపిస్తే ఆ ప్రభావం సహచర ప్లేయర్లపై తప్పకుండా పడుతుంది. అందుకే విరాట్ పాజిటివ్ మైండ్ సెట్‌తోనే కనిపిస్తున్నాడు. ఆటలో టీమ్మేట్స్‌ చెలరేగేలా ఎంకరేజ్ చేస్తున్నాడు. మరోవైపు సీజన్‌లో మూడుసార్లు గోల్డెన్ డక్ అయ్యాక తనపై వస్తున్న విమర్శలను విరాట్ గమనిస్తూనే ఉన్నాడు. కానీ అన్నిటికీ నవ్వుతోనే సమాధానం చెబుతున్నాడు.


అయితే ఆ నవ్వు వెనుక కోహ్లీ బాధపడుతున్నాడనే విషయాన్ని చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఫామ్‌లోకి రావాలన్న కసి కూడా ఆ నువ్వు వెనకాల దాగి ఉంది.  తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మీకు పెట్స్ అంటే ఇష్టమా అనే ప్రశ్న కోహ్లీకి ఎదురైంది. ఇష్టమే అంటూ విరాట్ నుంచి సమాధానం వచ్చింది. ఇంట్లో ఎన్ని పెట్స్ ఉన్నాయని ప్రశ్నిస్తే వాటిని చూసుకునేంత టైమ్ లేదంటూ కోహ్లీ ఆన్సర్ ఇచ్చాడు. అయితే ఆ వెంటనే  ఇటీవల మూడు డక్‌లను పెంచుకున్నట్టు అందరూ చూశారు కదా అనే ప్రశ్నను కోహ్లీ ఫేస్ చేశాడు. ఐనా కోహ్లీ తన స్టయిల్లో సమాధానం చెప్పాడు. గోల్డెన్ డక్‌ల గురించే కదా ప్రశ్న అంటూ నవ్వాడు. ప్రస్తుతం తన బాధ విమర్శకులకు ఏం తెలుసన్నాడు. విరాట్ నవ్వుపై అనుష్క కూడా స్పందించింది. మీరు నవ్వకపోతే శతాబ్దపు జోకులను కూడా మిస్సవుతారని పోస్ట్ పెట్టింది.

Read more