వైద్యంలో తెరవెనుక ప్రాణదాతలు అనెస్తీషియా డాక్టర్లు

ABN , First Publish Date - 2021-10-17T06:37:57+05:30 IST

అన్నిరకాల వైద్యానికి సేవలం దిస్తున్న మత్తు డాక్టర్లకు ప్రజల్లో అంతగా గుర్తింపు లేదని మత్తు డాక్టర్ల నిపుణులు ఆవేదన వ్యక్తం చేశా రు.

వైద్యంలో తెరవెనుక ప్రాణదాతలు అనెస్తీషియా డాక్టర్లు

వైరా, అక్టోబరు 16: అన్నిరకాల వైద్యానికి సేవలం దిస్తున్న మత్తు డాక్టర్లకు ప్రజల్లో అంతగా గుర్తింపు లేదని మత్తు డాక్టర్ల నిపుణులు ఆవేదన వ్యక్తం చేశా రు. ఈ మత్తు డాక్టర్లంతా రోగులకు తెరవెనుక ప్రాణ దాతలని స్పష్టం చేశారు. ప్రపంచ అనెస్తీషియా దినోత్సవం సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమం లో మత్తు డాక్టర్ల నిపుణులు డాక్టర్‌ కాపా మురళీకృష్ణ, డాక్టర్‌ భాగం కృష్ణారావు, డాక్టర్‌ సుగ్గల కిరణ్‌కుమార్‌, డాక్టర్‌ జి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. అనెస్తీషియా అంటే స్పెషలైజేషన్‌ కోర్సు అని పేర్కొన్నారు. ఎంబీబీ ఎస్‌ తర్వాత అనెస్తీషియా పీజీ కోర్సు అనే విష యం చాలామందికి తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రోగులకు అనెస్తీషియా డాక్టర్లు కన్పించని ప్రాణదాతలని స్పష్టం చేశారు. శస్త్రచికిత్సల్లో మత్తుమందు డాక్టర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. 


Updated Date - 2021-10-17T06:37:57+05:30 IST