బీజేపీ నాయకులకు మరో భంగపాటు

Nov 28 2021 @ 02:52AM

నోయిడా విమానాశ్రయ నమూనా ఇదే 

అంటూ బీజింగ్‌ ఎయిర్‌పోర్టు ఫొటో పోస్టు 


న్యూఢిల్లీ, నవంబరు 27: బీజేపీ నాయకులకు మరోసారి భంగపాటు ఎదురైంది. నోయిడాలో నిర్మించనున్న జేవార్‌ విమానాశ్రయం ఇలా ఉంటుందంటూ ఓ ఫొటోను ఆ పార్టీ నేతలు ట్విటర్‌లో పోస్టు చేశారు. అయితే అది చైనాలోని బీజింగ్‌ విమానాశ్రయ ఫొటో. కేంద్ర మంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, ప్రహ్లాద్‌ సింగ్‌ పాటిల్‌, అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య తదితరులు ఈ ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘‘నోయిడాలో నిర్మించే ఈ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్దది. దీం తో ఈ ప్రాంతానికి రూ.35 వేల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి’’ అని అనురాగ్‌ ఠాకూర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోలు వైరల్‌ కావడంతో బీజేపీ నేతల దుష్ప్రచారం మరోసారి బట్టబయలైందని చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌(జీటీఎన్‌) విమర్శించింది. బీజేపీ నేతలు పోస్టు చేసినది బీజింగ్‌లోని ‘డాక్సింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయ’ ఫొటో అని తెలిపింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.