శ్రీస్వర్ణకవచలాంకృత దుర్గాదేవిగా బెజవాడ దుర్గమ్మ

ABN , First Publish Date - 2022-09-27T07:38:46+05:30 IST

బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున శ్రీస్వర్ణకవచలాంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున మూడు నుంచి

శ్రీస్వర్ణకవచలాంకృత దుర్గాదేవిగా బెజవాడ దుర్గమ్మ

విజయవాడ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున శ్రీస్వర్ణకవచలాంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున మూడు నుంచి ఏడు గంటల వరకు వేద పండితులు అమ్మవారికి స్నపనాభిషేకాలు నిర్వహించారు. గవర్నరు హరిచందన్‌ దంపతులు, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారి తొలి దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి బాలభోగం నివేదన సమర్పించిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. సాధారణ భక్తులతోపాటు భవానీలు అధికసంఖ్యలో దుర్గమ్మను దర్శించుకున్నారు. కనకదుర్గమ్మ మంగళవారం శ్రీబాలాత్రిపురసుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. 

Updated Date - 2022-09-27T07:38:46+05:30 IST