రష్యా ఆఫర్‌ను ఒప్పుకోండి: ఉక్రెయిన్‌ను కోరిన బెలారస్

ABN , First Publish Date - 2022-02-27T20:32:57+05:30 IST

రష్యా ప్రతినిధి బృందం ఇప్పటికే బెలారస్‌కు చేరుకుంది. ఉక్రెయిన్ ప్రతినిధి బృందం రాక కోసం ఎదురు చూస్తోంది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిలో కొన్ని బెలారస్ నుంచి జరుగుతున్నట్లు జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నారు. ఉక్రెయిన్‌లో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలపై రష్యన్ దళాలు బాంబులు కురిపించాయని..

రష్యా ఆఫర్‌ను ఒప్పుకోండి: ఉక్రెయిన్‌ను కోరిన బెలారస్

మింస్క్: బెలారస్‌లో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్‌కు రష్యా పంపిన ఆహ్వానంపై బెలారస్ అధినేత అలెగ్జాండర్ లుకాషెంకో స్పందించారు. రష్యా ఆహ్వానాన్ని ఒప్పుకోవాలంటూ ఉక్రెయిన్‌ను ఆయన కోరారు. బెలారస్‌లో చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వయంగా బెలారస్ అధినేత స్పందించడం గమనార్హం. రష్యాతో వీలైనంత తొందరలో ఉక్రెయిన్ చర్చలు జరపడం ఉత్తమమని, ఎందుకు ఉక్రెయిన్‌కు దేశస్థాయి హోదా పోకుండా కాపాడుకోవాలని అలెగ్జాండర్ అన్నట్లు రష్యన్ మీడియా పేర్కొంది.


కాగా, రష్యా ప్రతినిధి బృందం ఇప్పటికే బెలారస్‌కు చేరుకుంది. ఉక్రెయిన్ ప్రతినిధి బృందం రాక కోసం ఎదురు చూస్తోంది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిలో కొన్ని బెలారస్ నుంచి జరుగుతున్నట్లు జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నారు. ఉక్రెయిన్‌లో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలపై రష్యన్ దళాలు బాంబులు కురిపించాయని, శనివారం-ఆదివారం మధ్య రాత్రి అత్యంత కిరాతకంగా వ్యవహరించాయని జెలెన్‌స్కీ తెలిపారు. మిలిటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేని, ప్రజలు నివసించే చోట దాడులు చేశారని చెప్పారు. అంబులెన్సులతో సహా ప్రతిదానిపైనా దురాక్రమణదారులు దాడి చేస్తున్నారని జెలెన్‌స్కీ అన్నారు.

Updated Date - 2022-02-27T20:32:57+05:30 IST