ఆగస్ట్ 19న 'బెల్ బాటమ్' రిలీజ్: అక్షయ్ కుమార్

Jul 31 2021 @ 08:00AM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'బెల్ బాటమ్' చిత్రాన్ని ఆగస్ట్ 19న రిలీజ్ చేయనున్నారు. స్పై థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను రంజిత్ ఎం తివారి రూపొందించారు. వాణీ కపూర్, లారా దత్తా, హుమా ఖురేషీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ యేడాది ఏప్రిల్ నెలలోనే 'బెల్ బాటమ్' విడుదల కావాల్సింది. అయితే, కరోనా సెకండ్ వేవ్ కారణంగా జూలై 27కు చిత్ర బృందం పోస్ట్‌పోన్ చేసింది. కానీ అప్పటికి కూడా దేశ, విదేశాలలో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. దాంతో మళ్ళీ వాయిదా వేశారు. కాగా తమ చిత్రాన్ని ఆగస్ట్ 19న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నామని తాజాగా అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను పూజా ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్స్ నిర్మించింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.