రైతులకు వరంగా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం

ABN , First Publish Date - 2022-09-26T03:42:42+05:30 IST

సంప్రదాయ సాగుతో నష్టాలు ఎదుర్కొం టున్న రైతులకు ఆధునిక సేద్యంతో అధిక దిగుబడులు సాధించేందుకు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సహకరిస్తున్నది. నూతన సాంకేతికత పరిజ్ఞానం, సాగు రంగంలో ఉపాధి మార్గాలు చూపుతోంది. ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసి కొత్త పరిశోధనలను రైతులకు చేరువ చేస్తోంది. మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో విలక్షణ కార్యక్రమాలు, వినూత్న సేవలతో కేవీకే కర్షకుల మన్ననలు పొందుతోంది.

రైతులకు వరంగా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం
కృషి విజ్ఞాన కేంద్రం నూతన భవనం

ఆధునిక సాగు, నూతన సాంకేతికతపై రైతులకు తోడ్పాటు

మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో విస్తృత సేవలు 

అవార్డులతో జాతీయ స్థాయిలో గుర్తింపు

నెన్నెల, సెప్టెంబరు 25: సంప్రదాయ సాగుతో నష్టాలు  ఎదుర్కొం టున్న రైతులకు ఆధునిక సేద్యంతో అధిక దిగుబడులు సాధించేందుకు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సహకరిస్తున్నది. నూతన సాంకేతికత పరిజ్ఞానం, సాగు రంగంలో ఉపాధి మార్గాలు చూపుతోంది. ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసి కొత్త పరిశోధనలను రైతులకు చేరువ చేస్తోంది. మంచిర్యాల,  కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో విలక్షణ కార్యక్రమాలు, వినూత్న సేవలతో కేవీకే కర్షకుల మన్ననలు పొందుతోంది. వ్యవసాయం, ఉద్యానంతోపాటు అనుబంధ రంగాలైన పాడి, కోళ్లు, పట్టుపురుగులు, తేనెటీగలు, చేపల పెంపకంలో రైతులకు సలహాలు, సూచనలిస్తున్నారు. నూతన సాంకేతికత పద్ధతులను, మేలైన యాజమాన్యం అందిపుచ్చుకొని సత్ఫలితాలు సాధిస్తున్నారు. పరిశోధనల్లో గుర్తింపుగా ఇక్కడి శాస్త్రవేత్తల కు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో, వారి సలహాలు, సూచనలు పాటిం చి లాభాలు పండిస్తున్న రైతులకు రాష్ట్రస్థాయిలో అవార్డులు లభించాయి.   రైతులకు వెన్నంటి నిలిచి వారి రాబడితోపాటు రెండు జిల్లాల ఆర్థికాభి వృద్ధిలో  బెల్లంపల్లి కేవీకే కీలకపాత్ర పోషిస్తోంది.

నాలుగేళ్ల ప్రస్థానం

2018 మార్చి 18న బెల్లంపల్లి కేవీకేను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శాటిలైట్‌ సిస్టం ద్వారా ప్రారంభించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌), ప్రొఫెసర్‌ జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యా లయం ఆధ్వర్యంలో రెండు జిల్లాల రైతులకు సేవలందిస్తోంది. రూ. 2 కోట్లు వెచ్చించి భవనం నిర్మించడంతో సేవలు మరింత విస్తృతం కానున్నాయి.  బెల్లంపల్లి సమీపంలో 50 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వివిధ రకాల పంటలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు.   ప్రద ర్శన క్షేత్రాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నీటి కుంటలు ఏర్పాటు చేసి చేపల పెంపకం చేపడుతున్నారు. తేనెటీగల పెంపకం, పూల సాగు, శాశ్వత పందిళ్లు, షేడ్‌నెట్స్‌ ఏర్పాటు చేసి కూరగాయలను పండిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు సల హాలు, సూచనలు ఇస్తున్నారు. భూసార పరీక్షలపై అవగాహన కల్పించడం, పచ్చి రొట్ట  ఎరువులు, వర్మికంపోస్టు తయారీ ద్వారా మొక్క ఎదుగుదలకు కావాల్సిన పొషకాలను వివరిస్తున్నారు. రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తున్నారు. చిరుధాన్యాలు, పప్పుఽ దినుసుల సాగును ప్రొత్సహిస్తున్నారు. వెదజల్లే పద్ధతిలో వరి సాగు, పొడి పద్ధతిలో నేరుగా వరి విత్తే విధానం, డ్రమ్‌సీడర్‌తో సాగు, అధిక సాంద్రతలో పత్తి సాగు, పత్తిలో పురుగు మందుల నిరోధకశక్తి యాజమాన్యం, (ఏఆర్‌ఎం), గులాబి రంగు పురుగు కట్టడికి కార్యాచరణ రూపొందించి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.

రైతుల ఆదాయం రెట్టింపు ఇలా 

ఆసిఫాబాద్‌ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో జొన్న సాగులో అధిక దిగుబడులు సాధించి ఆదాయం రెట్టింపు చేసుకునేలా అవగాహన కల్పిం చి విజయం సాధించారు. ట్రైబల్‌ ఫార్మర్‌ సబ్‌ప్లాన్‌ కింద 14 గ్రామాలను ఎంపిక చేసి మూడేళ్ల పాటు వారికి విత్తనాలను అందజేశారు. శాస్త్రవేత్తల సూచన మేరకు  393 మంది రైతులు 1200 ఎకరాల్లో  జొన్నలు సాగు చేశారు. విత్తనాలు నాటిన నుంచి పంట కోతల వరకు శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సలహాలు సూచనలిచ్చారు.  భూసార పరీక్షలు నిర్వహించి వాటికి అనుగుణంగా ఎరువులు వాడకం, పురుగు మందులు మోతాదుకు మించకుండా చూసుకున్నారు. గతంలో లోకల్‌ జొన్నలతో 460 కేజీల దిగుబడి సాధించిన రైతులు హైబ్రీడ్‌ విత్తనాలతో ఎకరానికి 850 కేజీల దిగుబడి సాధించారు. ఎకరానికి రూ.5,558ల అధిక ఆదాయం పొందారు. 393 ఎకరాల్లో లోకల్‌ జొన్నలు సాగు చేస్తే ఖర్చులు పోను రూ.11,44,416లు రాగా, నూతన వంగడాలతో రూ.32,28,710లు ఆదాయం వచ్చింది. 

సమీకృత వ్యవసాయం

సమీకృత వ్యవసాయంతో రైతులకు మంచి రాబడి మార్గాన్ని పరిచయం చేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఒక పంట దెబ్బతింటే మరో పంటతో గట్టెక్కే విధంగా శిక్షణనిస్తున్నారు. ఏక పంటతో నష్టాల పాలు కాకుండా మిశ్రమ పంటల సాగుతో ఎకరానికి కనీసం లక్ష ఆదా యం పొందే విధంగా ఒకే చోట వరిసాగు, కోళ్లు, చేపల పెంపకం, పండ్లు కూరగాయల సాగు చేసేలా చైతన్య పరుస్తున్నారు. పాడి రైతుల దాణా ఖర్చులు తగ్గించి వెన్న శాతం పెంచే అజొల్ల గడ్డి ఉచితంగా అందిస్తు న్నారు. స్థల సమస్య, కరువులో గ్రాసం సమస్య తలెత్తకుండా మొలకల గడ్డి పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు.

అవార్డులు... రివార్డులు

సాగు రంగంలో చేసిన సేవకు గుర్తింపుగా శాస్త్రవేత్తలకు, అధిక దిగుబడులు సాధించిన రైతులకు పలు అవార్డులు, రివార్డులు దక్కాయి. అంతర్జాతీయ సైంటిస్టు అవార్డు, పలు సార్లు బెస్ట్‌ సైంటిస్టు అవార్డులు, బెస్ట్‌ ఎమర్జింగ్‌ అవార్డు, నూనెగింజల సాగు, ఎస్టీ సబ్‌ప్లాన్‌, ట్రైబల్‌ ప్లాన్‌లకు బెస్ట్‌ ప్రాజెక్టు అవార్డులు దక్కాయి. ప్రొఫెసర్‌ జయశంకర్‌  రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 8వ వార్షికోత్సవం సందర్భంగా శాస్త్రవేత్త డాకర్‌ శివకృష్ణ కోటకు బెస్ట్‌ ఎక్స్‌టెన్షన్‌ సైంటిస్ట్‌ అవార్డు అందుకున్నారు. నెన్నెల మండలం నందులపల్లికి చెందిన కొండపల్లి శరత్‌, భీమిని మండలం అక్కలపల్లికి చెందిన సుంకర వెంకటేశ్వర్‌రావు, బెల్లంపల్లి మండలం బూదకుర్ధుకు చెందిన వీర్ల అంజయ్యలకు రాష్ట్ర స్థాయి అభ్యుదయ (బెస్ట్‌ ప్రొగ్రెసివ్‌ ఫార్మర్‌) రైతు అవార్డులు వరిం చాయి. రైతులు దుగుట తిరుపతి, బుద్దె విజయ్‌, ఎంబడి పద్మలకు ఉత్తమ రైతు పురస్కారాలు దక్కాయి. 

రైతులకు అందుబాటులో ఉండే శాస్త్రవేత్తలు

డాక్టర్‌ శివకృష్ణ (విస్తరణ శాస్త్రవేత్త) 9704646450

డాక్టర్‌ నాగరాజు (సస్యరక్షణ శాస్త్రవేత్త) 8096502152

డాక్టర్‌ తిరుపతి (పంట ఉత్పత్తి శాస్త్రవేత్త) 9494030004

డ్టాక్టర్‌ స్రవంతి (ఉద్యాన శాస్త్రవేత్త) 9490644782

డాక్టర్‌ సతీష్‌కుమార్‌ (వాతావరణ శాస్త్రవేత్త)8309357311

రైతుల ఆధాయాన్ని రెట్టింపు చేయడమే ధ్యేయం

డాక్టర్‌ రాజేశ్వర్‌ నాయక్‌,  ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌, కేవీకే బెల్లంపల్లి

అత్యాధునిక సాంకేతికతను రైతులకు చేరువ చేసి వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం.  బెల్లంపల్లిలో 50 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసి వివిధ పంటలు పండిస్తూ రైతులకు శిక్షణనిస్తున్నాం. ఎస్‌టీ సబ్‌ ప్లాన్‌ కింద గ్రామాలను దత్తత తీసుకొని వ్యవసాయ పరంగా అభివృద్ధి చేస్తున్నాం. సేద్యంలో రైతులకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాం. వ్యవసాయ సంబంధిత ఎలాంటి సమస్యలున్న సంప్రదిస్తే పంటలను పరిశీలించి పరిష్కారాలు చూపిస్తాం. కేవీకే సేవలను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలి. 

Updated Date - 2022-09-26T03:42:42+05:30 IST