ఢిల్లీలో 15 వేల దిగువకు..

ABN , First Publish Date - 2022-01-18T07:23:59+05:30 IST

ఢిల్లీ, ముంబై కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. జనవరి 13న ఢిల్లీలో అత్యధికంగా 28,86

ఢిల్లీలో 15 వేల దిగువకు..

  • వాణిజ్య రాజధానిలో 10 వేల కిందకు
  • బెంగాల్‌లో తగ్గిపోయిన పాజిటివిటీ.. 
  • దేశంలో 466 మందికి ఒమైక్రాన్‌
  • 2.58 లక్షల కేసులు.. 385 మరణాలు


 

ఢిల్లీ, ముంబై కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. జనవరి 13న ఢిల్లీలో అత్యధికంగా 28,867 కేసులు నమోదవగా, సోమవారం అవి గణనీయంగా తగ్గి 12,527కు చేరాయి. గత 24 గంటల్లో 18,340 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ముంబైలో జనవరి 7న ఒక్కరోజే 20,971 కేసులు బయటపడగా, తాజాగా అవి 7,895కు పరిమితమవడాన్ని సానుకూల అంశంగా చెప్పొచ్చు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోనూ రోజువారీ కొవిడ్‌ పాజిటివిటీ రేటు బాగా తగ్గిపోయింది. ఇది జనవరి 9న 33.8 శాతం ఉండగా, సోమవారం నాటికి తగ్గి 26.4 శాతానికి చేరింది. జనవరి 1 నుంచి ఇప్పటివరకు ఢిల్లీ పోలీసు శాఖలో 2,500 మందికి కొవిడ్‌ సోకగా, ఇప్పటివరకు 767 మంది కోలుకొని తిరిగి విధుల్లోకి చేరారు.


కరోనా నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ 50 శాతం సిబ్బందితోనే పనిచేస్తాయని కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ప్రకటించింది. 24 గంటల్లో 2.58 లక్షల మందికి కొవిడ్‌ నిర్ధారణ కాగా, 385 మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 19.65 శాతానికి చేరింది. కొత్తగా 466 మందికి ఒమైక్రాన్‌ సోకినట్లు గుర్తించగా, ఇందులో 287 కేసులు ఒక్క బెంగళూరులోనే బయటపడ్డాయి. ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌కు 157.20 కోట్ల టీకా డోసులను వినియోగించారు. దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మందికిపైగా పిల్లలు టీకా మొదటి డోసు తీసుకున్నారు.


Updated Date - 2022-01-18T07:23:59+05:30 IST