ఐదేళ్లలోపు చిన్నారులకు టీకాలు

ABN , First Publish Date - 2021-07-25T13:56:02+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపున్న 9.23 లక్షల మంది చిన్నారులకు న్యుమోనియా, మెదడు వాపు వ్యాధి నిరోధక టీకాలు అందజేయనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. స్థానిక ఎ

ఐదేళ్లలోపు చిన్నారులకు టీకాలు

చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపున్న 9.23 లక్షల మంది చిన్నారులకు న్యుమోనియా, మెదడు వాపు వ్యాధి నిరోధక టీకాలు అందజేయనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. స్థానిక ఎగ్మూర్‌లోని పిల్లల సంక్షేమ ఆస్పత్రిలో టీకాల శిబిరాన్ని శనివారం మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎగ్మూర్‌ ఎమ్మెల్యే పరంథామన్‌, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ తదితరులున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా న్యుమోనియా, మెదడు వాపు వ్యాధి సహా పలు ఆరోగ్య సమస్యలతో 12 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యువాతపడ్డారన్నారు. ఈ మరణాలను అడ్డుకొనేలా జాతీయ టీకా పథకంలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో ఈ టీకాల పంపిణీ చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరువళ్లూర్‌ జిల్లాలో లాంఛనంగా ప్రారంభించగా, ఎగ్మూర్‌ చిన్నపిల్లల ఆస్పత్రిలో ప్రతిరోజూ టీకా వేస్తున్నామని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో మూడు డోసులుగా వేసే ఈ టీకాకు రూ.12 వేల వరకు ఖర్చవుతుందని, ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. అన్ని జిల్లాల్లో టీకా వేసే కార్యక్రమం ప్రారంభించామన్నారు. తెన్‌కాశి జిల్లాకు చెందిన ఐదేళ్ల చిన్నారి బ్లీచింగ్‌ పౌడర్‌ తినడంతో బరువు పెరిగి ఎగ్మూర్‌ చిన్నపిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్నారు. చిన్నారి ఎలాంటి ఆహారం తీసుకోలేకపోవడంతో వైద్యులు కడుపుకు రంధ్రం వేసి ఆహారం అందిస్తున్నారని తెలిపారు. 6 కిలోల బరువుండాల్సిన చిన్నారి ప్రస్తుతం 8 కిలోల బరువుందని, చికిత్స అనంతరం చిన్నారి కోలుకునే అవకాశముందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపున్న 9.23 లక్షల మంది చిన్నారులకు టీకాలు వేస్తున్నామని, రెండేళ్ల క్రితమే ఈ టీకాలు వేయాల్సి ఉందన్నారు. కానీ, గత ప్రభుత్వం ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టలేదో అర్ధం కావడం లేదన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో వసతుల కల్పన, ఆధునిక వైద్యపరికరాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

Updated Date - 2021-07-25T13:56:02+05:30 IST