విషజ్వరాలతో బెంబేలు

ABN , First Publish Date - 2022-08-10T05:00:46+05:30 IST

మండలంలోని హసనాపురం పంచాయతీ చీకటివాండ్లపల్లెలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు విషజ్వరాల బారిన పడ్డారు. వీధుల్లో నీరు నిల్వ ఉండడం, పరిసరాలు శుభ్రత లేకపోవడం, కలుషితమైన నీరు తాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గ్రామంలో సుమారు 20 మందికి పైగా మలేరియా, టైఫాయిడ్‌, కామెర్లు వంటి వ్యాధులతో బాధపడుతున్నారని వారంటున్నారు.

విషజ్వరాలతో బెంబేలు
వీధుల్లో నిలిచిన మురికి నీరు

చీకటివాండ్లపల్లెలో భయాందోళనలో ప్రజలు 

రామాపురం, ఆగస్టు 9: మండలంలోని హసనాపురం పంచాయతీ చీకటివాండ్లపల్లెలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు విషజ్వరాల బారిన పడ్డారు. వీధుల్లో నీరు నిల్వ ఉండడం, పరిసరాలు శుభ్రత లేకపోవడం, కలుషితమైన నీరు తాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గ్రామంలో సుమారు 20 మందికి పైగా మలేరియా, టైఫాయిడ్‌, కామెర్లు వంటి వ్యాధులతో బాధపడుతున్నారని వారంటున్నారు. అలాగే వృద్ధులకు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వస్తున్నాయని, ముఖ్యంగా దోమలు విపరీతంగా వృద్ధి చెంది ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల నుంచి గ్రామంలో ఇంటికి ఒకరిద్దరు చొప్పున జ్వరాల బారిన పడ్డారని ఆరోపిస్తున్నారు. చికిత్స కోసం కడప, బెంగుళూరు, రాయచోటి, రామాపురం ఆసుపత్రుల్లో వేలకు వేలు డబ్బులు పెట్టి వైద్యం చేసుకుంటున్నా జ్వరాలు తగ్గడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. 


వైద్య శిబిరం ఏర్పాటు

మండలంలోని హసనాపురం పంచాయతీ చీకటివాండ్లపల్లెలో జ్వరాలతో బాధపడుతున్న గ్రామస్థులకు మంగళవారం మండల వైద్యాధికారి విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎవరెవరికి ఏమేమి సమస్యలు న్నాయో వాటిపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో 8 మంది జ్వరపీడితులకు రక్తపూతలు తీసి ల్యాబ్‌కు పంపారు. గ్రామంలో వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండి వాటిలో దోమలు వ్యాప్తి చెందడం ద్వారానే వ్యాపిస్తున్నాయని, అందుకోసం గ్రామంలో వైద్య సిబ్బందిచే అబేట్‌ ద్రావణం పిచికారీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 104 వైద్యాధికారి తేజేశ్వర్‌రెడ్డి, శ్రావణి, ఇంద్రజ, ఏఎన్‌ఎం ఇందిరా, ఆశావర్కర్‌ గంగాదేవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T05:00:46+05:30 IST