ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్

ABN , First Publish Date - 2022-04-28T23:49:33+05:30 IST

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ను ఆ జట్టు టెస్ట్ కెప్టెన్‌గా ప్రకటిస్తూ ఇంగ్లండ్ అండ్ వేల్స్

ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్

లండన్: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ను ఆ జట్టు టెస్ట్ కెప్టెన్‌గా ప్రకటిస్తూ ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో 0-4తో దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో జో రూట్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా స్టోక్స్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్ల జాబితాలో ఇంగ్లండ్ ప్రస్తుతం అట్టడుగున ఉంది. బెన్ స్టోక్స్  ఇప్పుడు ఇంగ్లండ్ టెస్టు జట్టుకు 81వ కెప్టెన్. అన్ని ఫార్మాట్లలోనూ మంచి మ్యాచ్ విన్నర్‌గా స్టోక్స్‌కు మంచి పేరుంది. 


విజయవంతమైన ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్లలో ఒకడిగా పేరుగాంచిన రూట్ ఇటీవలి పరాజయాల కారణంగా కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పేశాడు. రూట్ 64 టెస్టుల్లో ఇంగ్లండ్‌‌కు సారథ్యం వహించాడు. 27 టెస్టులో విజయాన్ని అందించి రికార్డులకెక్కాడు. అతడి విజయాల శాతం 42.18గా ఉంది. 50 అంతకంటే ఎక్కువ టెస్టులకు సారథ్యం వహించిన వారిలో మైఖేల్ వాన్ (50.98) తర్వాత రెండో అత్యధిక విజయాల శాతం రూట్‌దే 

 

 ఇక,  స్టోక్స్ విషయానికి వస్తే డిసెంబరు 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఫిబ్రవరి 2017లో వైస్-కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2020లో రూట్ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 5,061 టెస్టు రన్స్ ఉన్నాయి. సగటు 35.89. 174 వికెట్లు పడగొట్టాడు.  

Updated Date - 2022-04-28T23:49:33+05:30 IST