బెండీ ఫ్రై

ABN , First Publish Date - 2021-03-04T18:34:16+05:30 IST

బెండకాయలు- అర కిలో, సెనగ పిండి- సగం కప్పు, పసుపు: సగం స్పూను, కారం పొడి, గరం మసాలా పొడి, చాట్‌ మసాలా, కొత్తిమీర పొడి- స్పూను, ఉప్పు, నూనె- తగినంత

బెండీ ఫ్రై

కావలసిన పదార్థాలు: బెండకాయలు- అర కిలో, సెనగ పిండి- సగం కప్పు, పసుపు: సగం స్పూను, కారం పొడి, గరం మసాలా పొడి, చాట్‌ మసాలా, కొత్తిమీర పొడి- స్పూను, ఉప్పు, నూనె- తగినంత


తయారుచేసే విధానం: బెండకాయల్ని రెండు, మూడుసార్లు కడిగి తుడిచిపెట్టుకోవాలి. ఒక్కో బెండకాయను నిలువుగా కోయాలి. మసాలా పొడులు, సెనగపిండి, ఉప్పు, కారం అన్నిటినీ ఓ గిన్నెలో కలుపుకోవాలి. ఈ పిండిని కోసిన ఒక్కో బెండకాయలో దట్టించాలి. కడాయిలో నూనె వేసి వీటిని వేయిస్తే కుర్‌కురి బేండీ ఫ్రై సిద్ధం. వేపుడులా వద్దు అనుకునే వారు మసాలా దట్టించిన బెండకాయల్ని ఓవెన్‌లో బేక్‌ చేసుకోవచ్చు. ఇవి కూడా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.

Updated Date - 2021-03-04T18:34:16+05:30 IST