ప్రకృతి సాగుతో మేలు

ABN , First Publish Date - 2021-01-16T05:30:00+05:30 IST

ప్రకృతి వ్యవసాయంతో సమాజానికి, నేలకు మేలు కలుగుతుందని రాష్ట్ర సాధికారక సంస్థ ఎగ్జిక్యూటీవ్‌ వైస్‌ చైర్మన్‌ విజయకుమార్‌ అన్నారు.

ప్రకృతి సాగుతో మేలు
ప్రకృతి వ్యవసాయ సాగుపై ఆరా తీస్తున్న వైస్‌చైర్మన్‌ విజయకుమార్‌

  ఏపీ రైతు సాధికారక సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ విజయకుమార్‌

వేపాడ: ప్రకృతి వ్యవసాయంతో సమాజానికి, నేలకు మేలు కలుగుతుందని రాష్ట్ర సాధికారక సంస్థ ఎగ్జిక్యూటీవ్‌ వైస్‌ చైర్మన్‌ విజయకుమార్‌ అన్నారు. బొద్దాంలో సుస్థిర వ్యవసాయ కేంద్రాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ను పరిశీ లించి, ఫుడ్‌హబ్‌ అవుట్‌లెట్‌ను, బయో ఇన్‌ఫుట్‌ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. కార్య క్రమంలో ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ రామాంజనేయులు విజయనగరం, విశాఖ జిల్లాల డీపీఎం ప్రకాష్‌, ఏవో హేమసుందర్‌, సీఎస్‌ఏ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌,   రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

Updated Date - 2021-01-16T05:30:00+05:30 IST