ఆయిల్‌పాం సాగుతో లాభాలు

ABN , First Publish Date - 2022-06-29T06:41:14+05:30 IST

28:ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు.

ఆయిల్‌పాం సాగుతో లాభాలు
మొక్కలు నాటుతున్న కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌

ముస్తాబాద్‌, జూన్‌ 28:ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. మండలంలోని మద్దికుంటలో ఎంపీపీ జనగామ శరత్‌రావు వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్‌పాం సాగులో భాగంగా మంగళవారం  కలెక్టర్‌  అనురాగ్‌ జయంతి,   జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ ఆయిల్‌పాం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ గ్రామంలో ఆయిల్‌పాం సాగును విస్తరించాలన్నారు. మంత్రి కేటీఆర్‌ మార్గదర్శనం మేరకు జిల్లాలో రైతులను చైతన్యం చేయాలని,  వరి సాగు నుంచి ప్రత్యామ్యాయ పంటల వైపు మళ్లించేందుకు వ్యవసాయాధికారులు కృషి చేస్తున్నారని అన్నారు.  

తక్కువ పెట్టబడితో ఎక్కువ లాభాలు

ఆయిల్‌పాం సాగులో తక్కువ పెట్టబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని జడ్పీ చైర్‌ పర్సన్‌ అరుణ అన్నారు. ప్రత్నామ్నాయ పంటలతో కలిగే ప్రయోజనాలను తెలుసుకునేందుకు వీలుగా జిల్లా రైతులను మంత్రి కేటీఆర్‌ అశ్వరావుపేటకు పంపారన్నారు. అనంతరం మద్దికుంటలో  పల్లె ప్రకృతి వనాన్ని, కాళేశ్వరం జాలాలు వచ్చే కాలువలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జడ్పీటీసీ గుండం నర్సయ్య, జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బఽంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్‌రావు, ఏఎంసీ ఛైర్మన్‌ శీలం జానాబాయి, ఎంపీడీవో రమాదేవి, జిల్లా సూపర్‌ వైజర్‌ లత, ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, క్లస్టర్‌ అధికారి  స్రవంతి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

 ఆయిల్‌ఫాం సాగుపై  దృష్టి సారించాలి

ఎల్లారెడ్డిపేట: అన్నదాతలు ఆయిల్‌పాం సాగుపై దృష్టి సారించాలని అడిషనల్‌ కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలోని రైతు పాతూరి భూపాల్‌రెడ్డి వ్యవసాయ భూమిలో ఆయిల్‌పాం సాగు పనులను మంగళవారం ప్రారంభించారు. ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిం చేందుకు ప్రభుత్వం రైతులకు రాయితీ అందిస్తోందన్నారు.  జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, ఎంపీపీ రేణుక, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, సర్పంచ్‌ శంకర్‌, ఏఎంసీ చైర్మన్‌ రమేశ్‌, ప్యాక్స్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ భాస్కర్‌, తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌, ఎంపీడీవో చిరంజీవి, ఎంపీటీసీ రజిత, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T06:41:14+05:30 IST