గవర్నర్ ధనకర్‌కు షాకిచ్చే నిర్ణయం తీసుకున్న మమత ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-05-26T23:49:18+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, గవర్నర్ జగదీప్ ధనకర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న

గవర్నర్ ధనకర్‌కు షాకిచ్చే నిర్ణయం తీసుకున్న మమత ప్రభుత్వం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, గవర్నర్ జగదీప్ ధనకర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రస్థాయి యూనివర్సిటీలను ఇకపై ముఖ్యమంత్రే తన గుప్పిట్లో పెట్టుకునేలా రాష్ట్ర కేబినెట్ ఓ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయి వర్సిటీలకు గవర్నర్ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తుండగా, ఇకపై ఆ స్థానాన్ని ముఖ్యమంత్రికి అప్పగించేలా అసెంబ్లీలో చట్ట సవరణ చేయాలని గురువారం కేబినెట్ నిర్ణయించినట్టు  ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రాత్య బసు తెలిపారు. 


యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ల నియామకాల విషయంలో గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ధనఖర్ ఇటీవల మాట్లాడుతూ.. రాజ్‌భవన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వం వైస్ ఛాన్స‌లర్లను నియమించిందని ఆరోపించారు.  

Updated Date - 2022-05-26T23:49:18+05:30 IST