బెంగాల్‌ రంజీ జట్టు అరుదైన రికార్డు

ABN , First Publish Date - 2022-06-09T09:08:42+05:30 IST

రంజీ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో జరుగుతున్న క్వార్టర్‌ ఫైనల్‌లో బెంగాల్‌ జట్టు అరుదైన రికార్డును నమోదు చేసింది.

బెంగాల్‌ రంజీ జట్టు  అరుదైన రికార్డు

అర్ధ శతకాలు చేసిన 9 మంది బ్యాటర్లు

న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో జరుగుతున్న క్వార్టర్‌ ఫైనల్‌లో బెంగాల్‌ జట్టు అరుదైన రికార్డును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌ దిగిన బెంగాల్‌ మూడో రోజైన బుధవారం నాటికి 7 వికెట్ల నష్టానికి 773 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన జార్ఖండ్‌ మూడో రోజు ఆట ముగిసేసరికి 5 వికెట్లకు 139 పరుగులు చేసి బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు 634 పరుగుల వెనుకంజలో ఉంది.


రికార్డు విషయానికొస్తే బెంగాల్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ మొదలు తొమ్మిదో నెంబర్‌ ఆటగాడి వరకు ప్రతి ఒక్కరు అర్ధ సెంచరీ చేయడం విశేషం. ఎప్పుడో 1893లో అంటే 129 ఏళ్ల కిందట కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీపై 8 మంది ఆస్ట్రేలియా బ్యాటర్లు అర్ధ శతకాలు నమోదు చేశారు. ఇన్నేళ్ల తర్వాత ఈ రికార్డు బద్దలైంది. సుదీప్‌ కుమార్‌ (186), అనుస్తుప్‌ మజుందార్‌ (117) శతకాలు కూడా బాదడం విశేషం.

Updated Date - 2022-06-09T09:08:42+05:30 IST