Partha Chatterjee: అర్పితకు షాకిచ్చిన పార్థా ఛటర్జీ.. పుసుక్కున అంత మాట అనేశాడేంటి..!

ABN , First Publish Date - 2022-07-31T23:30:14+05:30 IST

పాఠశాల ఉద్యోగాల కుంభకోణం కేసులో (Bengal SSC Scam Case) అరెస్ట్ అయిన బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ (Partha Chatterjee) తాజాగా..

Partha Chatterjee: అర్పితకు షాకిచ్చిన పార్థా ఛటర్జీ.. పుసుక్కున అంత మాట అనేశాడేంటి..!

కోల్‌కత్తా: పాఠశాల ఉద్యోగాల కుంభకోణం కేసులో (Bengal SSC Scam Case) అరెస్ట్ అయిన బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ (Partha Chatterjee) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అర్పిత ముఖర్జీ (arpita mukherjee) ఇంట్లో ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బు తనది కాదని చెప్పుకొచ్చారు. తనపై ఎవరు కుట్ర చేస్తున్నారనే విషయంలో కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. తానొక పెద్ద కుట్రలో బాధితుడిగా మిగిలానని చెప్పారు. పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి సీఎం మమతా బెనర్జీ (mamata banerjee) ఇప్పటికే తప్పించిన సంగతి తెలిసిందే. టీఎంసీ పార్టీ నుంచి కూడా ఆయనను తొలగించారు.



ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీని కూడా అరెస్ట్ చేసింది. ఆమె ఇంట్లో ఈడీ సోదాలు చేయగా కోట్ల రూపాయల విలువైన నోట్ల కట్టలు దొరికాయి. 2014-2021 వరకు పార్థా చటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలోనే విద్యాశాఖలో ఈ కుంభకోణం వెలుగుచూసింది. పశ్చిమబెంగాల్‌ పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో (SSC Scam) ఆ రాష్ట్ర పారిశ్రామిక మంత్రి, టీఎంసీ సెక్రటరీ జనరల్‌ పార్థా చటర్జీని (Partha Chatterjee) అరెస్ట్ చేసిన ఈడీ (ED) కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆయన ఇంట్లో ఈ కుంభ కోణానికి సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్లు తెలిసింది.



ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ పోస్టుల (Teacher Posts) కోసం ఆశావహులుగా ఉన్న 48 మంది అభ్యర్థుల జాబితా రోల్ నంబర్లతో సహా పార్థా ఛటర్జీ ఇంట్లో (Partha Chatterjee House) లభ్యమైనట్లు కోర్టుకు ఈడీ వెల్లడించింది. రిక్రూట్‌మెంట్ టెస్ట్ కోసం అడ్మిట్ కార్డులు, గ్రూప్-డీ (Group D) సిబ్బంది నియామకానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఆయన ఇంట్లో లభ్యమైనట్లు న్యాయస్థానానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పార్థా ఛటర్జీ అరెస్ట్ అయిన తర్వాత టీఎంసీ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి (Mamata Banerjee) మూడు సార్లు కాల్ చేసినట్లు తెలిసింది. నాలుగోసారి కాల్ చేసినప్పటికీ పార్థా ఛటర్జీ నంబర్‌ను మమత బ్లాక్ చేసినట్లు సమాచారం.

Updated Date - 2022-07-31T23:30:14+05:30 IST