తునిలో పెద్దపులి

Published: Tue, 28 Jun 2022 01:21:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తునిలో పెద్దపులికుమ్మరిలోవ వద్ద తాండవ నదీతీరాన పులి పాదముద్రలు

తునిరూరల్‌, జూన్‌ 27: నెలరోజులుగా కాకినాడ జిల్లాలో అట వీ శాఖాధికారులకి చుక్కలు చూపిస్తున్న పెద్దపులి సోమవారం తుని నియోజకవర్గంలో అడుగుపెట్టింది. తుని పట్టణశివారు కుమ్మరిలోవ, కోలిమేరు గ్రామాలకు మధ్యలో గల కొండదిగి తాండ వ నదీతీరంలో సంచరిస్తునట్టు అటవీశాఖాధికారులు ధ్రువీకరించారు. అటువైపుగా వెళ్తున్న ఒక హేచరీ కంపెనీకి చెందిన బస్సు డ్రైవర్‌ కంటపడినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందారు. పొలాల్లో పశువులు కట్టుకున్న పాడిరైతులు పశువులను ఇంటికి తోలుకెళ్లారు. పులి ఏ వైపు నుంచి కొండదిగి ఎవరిమీద దాడి చేస్తుందోనని హడలెత్తుతున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.