బీజేపీలో చేరిన బెంగాలీ నటి

ABN , First Publish Date - 2021-03-02T00:49:18+05:30 IST

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీ..

బీజేపీలో చేరిన బెంగాలీ నటి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీ బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజపీ పరిశీలకుడు కైలాష్ విజయవర్గీయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, బీజేపీ కో-ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ సమక్షంలో ఆమె సోమవారంనాడు బీజేపీ తీర్ధం తీసుకున్నారు. 1997లో 'మయర్ బధోన్' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన చటర్జీ ఆ తరువాత 'ఛాంపియన్', 'అమానుష్', 'కనమచి', 'జియా పగ్లా', 'ఛోబియల్' వంటి పలు చిత్రాల్లో నటించారు. గత నెలలో ప్రముఖ బెంగాలీ నటుడు యష్ దాస్‌గుప్తా కూడా బీజేపీలో చేరారు. వ్యవస్థలో మార్పు తీసుకు రావాలంటే యువతకు అవకాశాలు ఇవ్వాలని, బీజేపీ ఎప్పుడూ యువతను ప్రోత్సహిస్తూ వస్తోందని చెప్పారు. కాగా, 8 విడతలు జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27న మొదలై ఏప్రిల్ 29తో ముగుస్తాయి. ఫలితాలు మే 2న వెలువడుతాయి.

Updated Date - 2021-03-02T00:49:18+05:30 IST