బీజేపీకి షాకిచ్చిన బెంగాలీ నటి..

ABN , First Publish Date - 2021-11-11T20:48:37+05:30 IST

శ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత మార్చి 2న బీజేపీలో చేరిన బెంగాలీ నటి..

బీజేపీకి షాకిచ్చిన బెంగాలీ నటి..

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత మార్చి 2న బీజేపీలో చేరిన బెంగాలీ నటి స్రవంతి ఛటర్జీ ఆ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌ అభివృద్ధిపై బీజేపీకి ఎలాంటి చొరవ, చిత్తశుద్ధి లేదని, సరైన ప్రణాళికలు లేవని, అందుకే తాను పార్టీని వీడుతున్నానని ఆమె స్పష్టం చేశారు.


అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన స్రవంతి చటర్జీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు కైలాష్ విజయవర్గీయ, దిలీప్ ఘోష్‌లో పలు ర్యాలీల్లో కూడా పాల్గొన్నారు. బెహలా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేశారు. 60 వేల ఓట్లకు పైగా ఆమె గెలుచుకున్నప్పటికీ టీఎంసీ అభ్యర్థి పార్థ ఛటర్జీ చేతిలో ఓటమి పాలయ్యారు. టీఎంసీలో చేరే అవకాశాలపై స్రవంతి ఛటర్జీని ప్రశ్నించినప్పుడు, కాలమే చెప్పాలంటూ సమాధానం దాటవేశారు.

Updated Date - 2021-11-11T20:48:37+05:30 IST