Double decker: మరోసారి రోడ్డెక్కనున్న డబుల్‌ డెక్కర్‌

ABN , First Publish Date - 2022-09-16T17:24:38+05:30 IST

బెంగళూరు నగరంలో మూడు దశాబ్దాల కిందట సంచరిసున్న బస్సుపై మరో బస్సు(డబుల్‌ డెక్కర్‌)లు మరోసారి నగర వీధుల్లో హల్‌ఛల్‌

Double decker: మరోసారి రోడ్డెక్కనున్న డబుల్‌ డెక్కర్‌

బెంగళూరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగరంలో మూడు దశాబ్దాల కిందట సంచరిసున్న బస్సుపై మరో బస్సు(డబుల్‌ డెక్కర్‌)లు మరోసారి నగర వీధుల్లో హల్‌ఛల్‌ చేయనున్నాయి. 1970-80వ కాలంలో బెంగళూరులోని ప్రధాన మార్గాలన్నింటా డబుల్‌ డెక్కర్‌(Double decker) బస్సులు తిరిగేవి. ప్రయాణీకలు వీటిలో సంచరించేందుకు కుతూహలం చూపేవారు. బస్సులకు ఆదరణ తగ్గుతున్న తరుణంలో అంచెలంచెలుగా తగ్గుతూ వచ్చే వి. 1997నాటికి దాదాపు డబుల్‌ డెక్కర్‌లు అన్నీ రద్దు చేశారు. అదే తరహా4 బస్సులను మరింత ఆధునికీకరించి నగర వీధుల్లో  సంచరించనున్నాయి. ముంబైలోని బెస్ట్‌ సర్వీసుల తరహాలోనే బీఎంటీసీ కూడా పది డబుల్‌ డెక్కర్‌ ఏసీ ఎలక్ట్రికల్‌ బస్సులను పరిచయం చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రాంట్‌లను సిద్ధం చేశా రు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ నుంచి బెంగళూరు కార్పొరేషన్‌(Bangalore Corporation)కు రూ.140 కోట్లు మంలజూరు చేయగా ఇందులో కొంతమేర నిధులు కేటాయించదలచా రు. ప్రస్తుతానికి పది ఎలక్ర్టికల్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులను సిద్ధం చేయనున్నారు. మెజిస్టిక్‌ నుంచి సుదూర మార్గాలలో సంచరింపచేసే ఆలోచన ఉన్నట్లు బీఎంటీసీ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-09-16T17:24:38+05:30 IST