నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణకు మాస్టర్‌ ప్లాన్‌

ABN , First Publish Date - 2022-04-14T16:58:16+05:30 IST

రాజధాని బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణకు మాస్టర్‌ప్లాన్‌ సిద్ధమైంది. బెంగళూరు చుట్టుపక్కల 154 కిలోమీటర్ల మేర పొడవైన పలు రహదారులను అభివృద్ధి

నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణకు మాస్టర్‌ ప్లాన్‌

- 154 కిలో మీటర్ల రహదారుల అభివృద్ధి

-  రూ.2వేల కోట్లతో అంచనా


బెంగళూరు: రాజధాని బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణకు మాస్టర్‌ప్లాన్‌ సిద్ధమైంది. బెంగళూరు చుట్టుపక్కల 154 కిలోమీటర్ల మేర పొడవైన పలు రహదారులను అభివృద్ధి చేసేందుకు ప్రభు త్వం కసరత్తు చేస్తోంది. మైసూరు, తుమకూరు, హాసన్‌, ఆనేకల్‌, కనకపుర, వైట్‌ఫీల్డ్‌, ఎలకా్ట్రనిక్‌సిటీ, అత్తిబెలెతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కెంపేగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే అన్ని మార్గాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా నగరంపై కొంతమేర ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. కర్ణాటక రోడ్ల అభివృద్ధి మండలి (కేఆర్‌డీసీఎల్‌) ద్వారా 154 కిలోమీటర్ల పొడవుతో బెంగళూరు స పోర్టింగ్‌ రోడ్లను నిర్మిస్తారు. ఇందు కోసం రూ.2వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ పథకంతో కొత్తగా రోడ్లు నిర్మించడం లేదు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర, జాతీయ రహదారులతోపా టు జిల్లాలోని ప్రధాన రోడ్లను 2 నుంచి 4 లేన్‌లకు విస్తరింపచేస్తారు. రోడ్లకు అనుబంధంగా ఉం డే రైల్వే గేట్లు, గ్రామీణ ప్రాంతాల వద్ద అండర్‌పా్‌సలు, ఫ్లై ఓవర్‌లు నిర్మించి సిగ్నల్‌ ఫ్రీ కారిడార్‌లను అభివృద్ధి చేస్తారు. సదరు పనులు పూర్తయితే బెంగళూరు ట్రాఫిక్‌ కనీసం 20 శాతం ఒత్తిడి తగ్గనుందని అంచనా వేశారు. ఇందుకు సంబంధించి మూడేళ్ల క్రితమే మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం కాగా న్యాయపరమైన సమస్యలు, భూ సేకరణ వంటి వాటితో జాప్యం జరిగింది. ఈ ఏడాది ఆరంభంలో పనులు మొదలు కాగా దాదాపు 50 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. విద్యుత్‌ లైన్లు, నీటి కాలువలు, చెట్లను తొలగించడం, మార్పు చేయడం వంటి ప్రక్రియ సాగుతోంది. వేగవంతంగా పనులు చేపడుతున్నామని కేఆర్‌డీసీఎల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఆర్‌ ప్రసాద్‌ తెలిపారు. దేవనహళ్లి వద్ద ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే మూడో అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. రోజూ వందలాది విమానాలు దేశ విదేశాలకు రాకపోకలు సాగిస్తాయి. ఇలా వేలాది మంది ఎయిర్‌పోర్ట్‌ రోడ్డులో సంచారం సాగిస్తుంటారు. ఇటీవల నాలుగైదేళ్లుగా విమానాల ద్వారా సరు కు రవాణా కూడా పెరిగింది. బెంగళూరు నుంచి దుబాయ్‌తోపాటు ఇతర దేశాలకు ప్రతిరోజూ కూరగాయలు, ఇతర వస్తువులు ఎగుమతి అవుతాయి. ఎయిర్‌పోర్ట్‌ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరుకు రవాణా సులభతరంగా సాగుతోంది. 


వర్తూరు వద్ద ఎలివేటెడ్‌ కారిడార్‌ 

వర్తూరు వద్ద ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు 1.92 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్‌ కారిడార్‌ను రూ.182.76 కోట్లతో నిర్మిస్తున్నారు. 2024 జూన్‌ నాటికి నిర్మాణాలు పూర్తి కానున్నా యి. అదనంగా ప్రభుత్వానికి రూ.587.20 కోట్లు గ్రాంటు కోసం కేఆర్‌డీసీఎల్‌ విన్నవించింది. గొల్లహళ్లి, రాజానుకుంట, నారాయణపుర, కాడుగూడి వద్ద రైల్వే ఫ్లై ఓవర్లు, బసనహళ్లి వద్ద రైల్వే అండర్‌పాస్‌, దొమ్మసంద్ర, వర్తూరు చెరువుతోపాటు మూడు చోట్ల గ్రేడ్‌ సపరేటర్లను నిర్మిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కల్గిన బెంగళూరు అత్యంత వేగం గా అభివృద్ధి చెందుతోంది. అందుకు అనుగుణంగా రోడ్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం నగరం చుట్టూ రోడ్ల నిర్మాణాలు పూర్తయితే కొంతమేర ట్రాఫిక్‌ సమస్య తగ్గనుంది. 

Updated Date - 2022-04-14T16:58:16+05:30 IST