60 మంది విద్యార్థులకు కరోనా.. మూతబడిన బెంగళూరు కాలేజీ

ABN , First Publish Date - 2021-09-30T02:21:34+05:30 IST

కోవిడ్ కట్టడికి కర్ణాటక సర్కారు కఠిన చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ కర్ణాటక రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళరూరు సమీపంలో ఉన్న ఒక రెసిడెన్సియల్ కాలేజీలో 60 మంది విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు చేయడంతో కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. విద్యార్థులకు కరోనా సోకడంతో రెసిడెన్సియల్ కాలేజీ ని మూసివేశారు.

60 మంది విద్యార్థులకు కరోనా.. మూతబడిన బెంగళూరు కాలేజీ

బెంగళూరు: కోవిడ్ కట్టడికి కర్ణాటక సర్కారు కఠిన చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ కర్ణాటక రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళరూరు సమీపంలో ఉన్న ఒక రెసిడెన్సియల్ కాలేజీలో 60 మంది విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు చేయడంతో కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. విద్యార్థులకు కరోనా సోకడంతో రెసిడెన్సియల్ కాలేజీ ని మూసివేశారు.


ఒక విద్యార్థికి జ్వరం రావడంతో 195 మంది విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు చేశామని అధికారులు చెప్పారు. అందులో 60 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, మిగిలిన కోవిడ్ ఫలితాలు రావాల్సి ఉందని బెంగళూరు అర్బన్ జిల్లా వైద్య అధికారి శ్రీనివాస్ బుధవారం పీటీఐతో చెప్పారు. 59 మంది విద్యార్థులను క్వారంటైన్‌కు పంపగా, తీవ్రమైన జ్వరం ఉన్న విద్యార్థిని లేడీ కర్జన్ ఆసుపత్రిలో చేర్చారు. విద్యార్థులకు కరోనా సోకడంతో ప్రస్తుతం రెసిడెన్సియల్ కాలేజీని మూసివేశామని వైద్య అధికారి శ్రీనివాస్ చెప్పారు. కరోనా సోకిన మెజారిటీ విద్యార్థులు కర్ణాటకకు చెందినవారు ఉండగా, మిగిలిన వారు తమిళనాడు చెందిన వారు ఉన్నారు. హాస్టల్‌లో 485 మంది విద్యార్థులు ఉండగా, కళాశాలలో 22 మంది ఉపాధ్యాయులు ఉన్నారని, 35 మంది ఇతర సిబ్బంది ఉన్నారని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. కోవిడ్ -19 పాజిటివ్ కేసుల అనంతరం హాస్టల్ మరియు తరగతి గదులను శానిటైజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-09-30T02:21:34+05:30 IST