Bengaluru పాలికె ఎన్నికలు అనుమానమే..?

ABN , First Publish Date - 2022-05-12T17:45:45+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్రాలు సకాలంలో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలు జరగడం

Bengaluru పాలికె ఎన్నికలు అనుమానమే..?

                    - మరోసారి పిటిషన్‌ వేయనున్న రాష్ట్ర ప్రభుత్వం


బెంగళూరు: స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్రాలు సకాలంలో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలు జరగడం అనుమానమేనని తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ డివిజన్‌కు బదిలీ కావడంతో ఎన్నికలు సాగడం సులువు కాదనిపిస్తోంది. బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటీషన్‌ పెండింగ్‌ ఉన్న మేరకు ప్రస్తుతం జారీ చేసిన ఆదేశాలపై రాష్ట్రప్రభుత్వం మరోసారి పిటీషన్‌ దా ఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకుని తదుపరి తీర్మానించాల్సి ఉంది. సుప్రీం తీర్పును సమగ్రంగా అధ్యయనం చేయాలని అడ్వకేట్‌ జనరల్‌కు ముఖ్యమంత్రి సూచించినట్టు సమాచారం. బీబీఎంపీకి 2020 సెప్టెంబరులోనే ఎన్నికలు జరగాల్సి ఉండేది. ప్రస్తుతం 198 వార్డులు ఉండగా వాటిని 243కు విస్తరించారు. వార్డుల విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కానీ 198 వార్డులకే ఎన్నికలు జరిపేలా సుప్రీం సూచించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పిటీషన్‌ దాఖలు చేస్తే ఎన్నికలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. 

Read more