బెంగళూరులోనే అత్యధిక Covid కేసులు

ABN , First Publish Date - 2022-03-18T17:21:30+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కొవిడ్‌ ప్రభావం తగ్గినా బెంగళూరులో అత్యధిక కేసుల పరంపర సాగుతోంది. గురువారం 140మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 99మంది,

బెంగళూరులోనే అత్యధిక Covid కేసులు

బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కొవిడ్‌ ప్రభావం తగ్గినా బెంగళూరులో అత్యధిక కేసుల పరంపర సాగుతోంది. గురువారం 140మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 99మంది, చిత్రదుర్గలో పదిమంది బాధితులయ్యారు. 14 జిల్లాల్లో ఒక్కకేసు నమోదు కాలేదు. 13 జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. 162 మంది కోలుకున్నారు. కేవలం బెంగళూరులో ఇద్దరు మృతి చెందారు. 30 జిల్లాల్లో 2,067 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 16 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు ఉన్నారు.

Updated Date - 2022-03-18T17:21:30+05:30 IST