High Court: రమేశ్‌ సీడీ కేసుపై 26లోగా అభ్యంతరాలను సమర్పించండి

ABN , First Publish Date - 2022-09-06T17:04:34+05:30 IST

మాజీ మంత్రి రమేశ్‌జార్కిహొళి రాసలీలల సీడీ విషయంలో అభ్యంతరాలు ఉంటే కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

High Court: రమేశ్‌ సీడీ కేసుపై 26లోగా అభ్యంతరాలను సమర్పించండి

                                           - హైకోర్టు


బెంగళూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి రమేశ్‌జార్కిహొళి రాసలీలల సీడీ విషయంలో అభ్యంతరాలు ఉంటే కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి(Ramesh Jarkiholi) సీడీ కేసు విచారణ చేపట్టిన సిట్‌, బెంగళూరు సదాశివనగర్‌లో నమోదైన బ్లాక్‌మెయిల్‌ కేసులను రద్దు చేయాలని హైకోర్టులో దాఖలైన పిటీషన్‌పై సోమవారం విచారణ సాగింది. అభ్యంతరాలు ఉంటే ఈనెల 26లోగా సమర్పించాలని న్యాయమూర్తి(Judge) ఆదేశించారు. కాగా సీడీ యువతి తరపున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది ఇందిరాజైసింగ్‌ గత విచారణ సందర్భంలోనే నివేదికను ఇంగ్లీషులో పొం దుపరచాలని కోరినా జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 

Updated Date - 2022-09-06T17:04:34+05:30 IST