పోర్న్ సినిమాలకు బానిసైన ఆటో డ్రైవర్.. భార్యపై అనుమానంతో పిల్లల ఎదుటే ఎంత పని చేశాడంటే..

ABN , First Publish Date - 2022-04-19T21:44:06+05:30 IST

అతను బెంగళూరులో ఆటో డ్రైవర్.. తరచుగా పోర్న్ సినిమాలు చూసేవాడు.. రెండు నెలల క్రితం మొబైల్ లో ఓ పోర్న్ చిత్రాన్ని చూశాడు.

పోర్న్ సినిమాలకు బానిసైన ఆటో డ్రైవర్.. భార్యపై అనుమానంతో పిల్లల ఎదుటే ఎంత పని చేశాడంటే..

అతను బెంగళూరులో ఆటో డ్రైవర్.. తరచుగా పోర్న్ సినిమాలు చూసేవాడు.. రెండు నెలల క్రితం మొబైల్ లో ఓ పోర్న్ చిత్రాన్ని చూశాడు.. అందులో ఉన్న మహిళ తన భార్యేనన్న అనుమానం అతనికి కలిగింది. అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలు పెట్టాడు.. 20 రోజుల క్రితం తీవ్రంగా కొట్టడంతో ఆమె హాస్పిటల్ పాలైంది.. కోలుకుని ఇంటికి తిరిగి వచ్చిన ఆమెను పిల్లల ఎదుటే కత్తితో పొడిచి చంపేశాడు. 


బెంగళూరులో ఆటో డ్రైవర్ గా పనిచేసే జహీర్ పాషా‌ పదిహేనేళ్ల క్రితం ముబీనా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. తరచుగా పోర్న్ సినిమాలు చూసే జహీర్ రెండు నెలల క్రితం మొబైల్‌లో ఓ పోర్న్ వీడియో చూశాడు. అందులో ఉన్న మహిళ తన భార్యలాగే కనిపించింది. తన భార్య కూడా పోర్న్ సినిమాల్లో నటిస్తోందన్న అనుమానం అతనికి కలిగింది. అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. 20 రోజుల క్రితం భార్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. 


కూతురి పరిస్థితి చూసిన తట్టుకోలేకపోయిన తండ్రి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయబోయాడు. అయితే ముబీనా కేసు పెట్టవద్దని తన తండ్రిని అడ్డుకుంది. కోలుకుని ఇంటికి తిరిగి వచ్చిన భార్యపై మరోసారి జహీర్ దాడి చేశాడు. పిల్లల ఎదురుగానే ఆమెను కత్తితో పొడిచేశాడు. పెద్ద కుమారుడు తాత దగ్గరకు వెళ్లి చెప్పడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఇంటికి వచ్చేసరికే ముబీనా విగతజీవిగా పడి ఉంది.

Updated Date - 2022-04-19T21:44:06+05:30 IST