Swiggy delivery Agent: ఆర్డర్ ఎంత సేపటికీ రాకపోవడంతో స్వీగ్గీ డెలివరీ బాయ్‌పై ఆగ్రహం.. తీరా అతడిని చూసి షాక్!

ABN , First Publish Date - 2022-08-13T00:48:23+05:30 IST

బెంగళూరు (Bengaluru)లో ఆ రోజు చాలా ప్రశాంతంగా ఉంది. లింక్డ్ ఇన్ యూజర్ రోహిత్ కుమార్ సింగ్ వండుకోవడం ఇష్టం లేక స్విగ్గీ

Swiggy delivery Agent: ఆర్డర్ ఎంత సేపటికీ రాకపోవడంతో స్వీగ్గీ డెలివరీ బాయ్‌పై ఆగ్రహం.. తీరా అతడిని చూసి షాక్!

బెంగళూరు (Bengaluru)లో ఆ రోజు చాలా ప్రశాంతంగా ఉంది. లింక్డ్ ఇన్ యూజర్ రోహిత్ కుమార్ సింగ్ వండుకోవడం ఇష్టం లేక స్విగ్గీ (Swiggy) ద్వారా ఆర్డర్ చేశాడు. అనుకున్న సమయం కంటే డెలివరీ బాయ్ (Swiggy delivery Agent)రావడం ఆలస్యమైంది. దాంతో అతడికి రోహిత్ ఫోన్ చేశాడు. `కొద్దిసేపట్లో మీ ఇంటి ముందు ఉంటాన`ని డెలివరీ బాయ్ చెప్పాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో మళ్లీ ఫోన్ చేసి.. `బ్రదర్ త్వరగా రండి.. నాకు చాలా ఆకలిగా ఉంద`ని చెప్పాడు. కొద్ది సేపటి తర్వాత డోర్‌బెల్ రింగ్ అయింది. అంత ఆలస్యంగా వచ్చిన డెలివరీ బాయ్‌ని తిట్టాలనుకుని రోహిత్ డోర్ తీశాడు. 


ఇది కూడా చదవండి..

Cruel Husband: భర్త క్రూరత్వాన్ని భరించలేక మహిళ ఆత్మహత్య.. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు వెల్లడి!


డోర్ తీసి అవతల ఉన్న స్విగ్గీ డెలివరీ బాయ్‌ను చూసి రోహిత్ షాకయ్యాడు. ఆ డెలివరీ బాయ్ వయసు 40 ఏళ్లు ఉంటుంది. రెండు ఊతకర్రలతో తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ చిరునవ్వుతో నిల్చున్నాడు. అతడిని చూసి రోహిత్ సిగ్గుపడ్డాడు. ఆ ఘటన గురించి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. `అతని పేరు కృష్ణప్ప రాథోడ్. ఒక కెఫేలో పనిచేసే కృష్ణప్ప కరోనా సమయంలో ఉద్యోగాన్ని కోల్పోయాడు. తన ముగ్గురు పిల్లలను పోషించుకునేందుకు డెలివరీ బాయ్‌గా మారాడు. వారిని బెంగళూరులో ఉంచే స్థోమత లేక పల్లెటూరిలో ఉంచి తను ఒక్కడే బెంగళూరులో ఉంటున్నాడు. రోజూ తెల్లవారు ఝామునే నిద్ర లేచి వంట చేసుకుని ఉద్యోగం ప్రారంభిస్తాడు. రోజంతా నగరంలో తిరిగి డెలివరీలు చేస్తుంటాడ`ని రోహిత్ తెలిపాడు. 


తన ప్రవర్తన పట్ల కృష్ణప్పకు క్షమాపణ చెప్పానని, ఎవరైనా అతనికి సహాయం చేయాలనుకుంటే తనకు మెసేజ్ చేయాలని రోహిత్ పేర్కొన్నాడు. కాగా, ఈ పోస్ట్ చదివిన నెటిజన్లు కృష్ణప్ప ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ పోస్ట్ ఇప్పటికే 14 వేల లైకులను స్వంతం చేసుకుంది. 

Updated Date - 2022-08-13T00:48:23+05:30 IST