Shocking: ఛీ..ఛీ.. వీడసలు మనిషేనా? భార్యతో నీచ ప్రవర్తన.. తలపై మూత్రం పోసి.. దారణం
ABN , First Publish Date - 2022-08-12T22:01:25+05:30 IST
ఎన్నో ఆశలతో అత్తింట అడుగుపెట్టిన ఆమెకు అవమానాలే ఎదురయ్యాయి.
ఎన్నో ఆశలతో అత్తింట అడుగుపెట్టిన ఆమెకు అవమానాలే ఎదురయ్యాయి. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఆమెకు నరకం కనిపించింది. డ్రగ్స్‌కు బానిసైన (Drug addict) భర్త పశువులా ప్రవర్తించాడు. అయినా ఆమె తన భర్త ఆగడాలను భరించింది. భార్య ఏమీ అనకపోవడంతో అతని ఆగడాలు శ్రుతి మించాయి. ఇటీవల తన భార్యను హింసించి ఆమె తలపై మూత్రం (Husband urinates on wife's head) పోశాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
ఇది కూడా చదవండి..
Guests to Pay for Wedding Meals: వధువుకు వింత ఆలోచన.. పెళ్లి భోజనం చేసే అతిథుల నుంచి డబ్బులు వసూలు!
బెంగళూరు (Bengaluru)లోని బసవనగడికు చెందిన సందీప్ అనే వ్యక్తికి తెలంగాణకు చెందిన ఓ యువతిని ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో సందీప్నకు భారీగా కట్నం ఇచ్చారు. ఒక లగ్జరీ కారు, 4 కేజీల బంగారం, భారీగా నగదు ముట్టుజెప్పారు. తీరా కాపురానికి వెళ్లాక సందీప్ అసలు రూపం బయటపడింది. అతడు డ్రగ్స్‌కు బానిస అని తేలింది. తరచుగా డ్రగ్స్ తీసుకోవడం, స్నేహితులతో ఇంట్లోనే మందు పార్టీలు చేసుకోవడం వంటివి చేసేవాడు. భార్య వద్దని వారించినా అతడు పట్టించుకోలేదు.
తనను శారీరకంగా, మానసికంగా హింసించినా ఆమె భరించింది. కానీ, ఇటీవల సందీప్ ఆగడాలు పెచ్చు మీరాయి. భార్యను తరచుగా హింసించేవాడు. కొద్ది రోజులు క్రితం భార్యతో గొడవ పడి ఆమె తలపై మూత్ర విసర్జన చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.