ఆ పిచ్ ‘బిలో యావరేజ్’ అట.. బెంగళూరు పిచ్‌పై ఐసీసీ పెదవి విరుపు

Published: Sun, 20 Mar 2022 19:03:12 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆ పిచ్ బిలో యావరేజ్ అట.. బెంగళూరు పిచ్‌పై ఐసీసీ పెదవి విరుపు

బెంగళూరు: భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్‌పై ఐసీసీ పెదవి విరిచింది. మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ దీనిని ‘బిలో యావరేజ్’గా పేర్కొన్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఐసీసీ పిచ్ అండ్ ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ విధానంలో భాగంగా ఈ పిచ్‌కు ఓ డిమెరిట్ పాయింట్ దక్కింది.


పిచ్‌ తొలి రోజు బాగా టర్న్ అయిందని, ఆ తర్వాత ప్రతి సెషన్‌లోనూ మెరుగుపడినప్పటికీ తన దృష్టిలో ఇది బ్యాట్, బాల్ మధ్య పోటీ కానేకాదని శ్రీనాథ్ చెప్పాడు. ఈ నివేదికను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు పంపినట్లు పేర్కొన్నాడు. ఈ టెస్టులో భారత జట్టు 238 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది.  

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.