వర్షం వస్తోంది కదా అని మెట్రో స్టేషన్ల కింద తలదాచుకున్నారో.. జేబు ఖాళీ అవుతుంది జాగ్రత్త!

ABN , First Publish Date - 2022-09-03T01:28:14+05:30 IST

నగరమేదైనా వర్షం వస్తుంటే బైకర్లు వెంటనే సమీపంలోని ఫ్లై ఓవర్ కిందో, మెట్రో పిల్లర్ల కిందో, అండర్‌పాస్‌ కిందకో

వర్షం వస్తోంది కదా అని మెట్రో స్టేషన్ల కింద తలదాచుకున్నారో.. జేబు ఖాళీ అవుతుంది జాగ్రత్త!

బెంగళూరు: నగరమేదైనా వర్షం వస్తుంటే బైకర్లు వెంటనే సమీపంలోని ఫ్లై ఓవర్ కిందో, మెట్రో పిల్లర్ల కిందో, అండర్‌పాస్‌ కిందకో వెళ్లి తలదాచుకుంటారు. ఇకపై అలా తలదాచుకుంటే జరిమానా చెల్లించుకోవాల్సిందేనని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇలా తలదాచుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. 


ఈ ఆదేశాలను తొలిసారి ఉల్లంఘించిన వారికి రూ. 500 జరిమానా విధిస్తారు. పదేపదే అదే పనిచేస్తే కేసులు నమోదు చేస్తారు. వర్షాకాంలో ఫ్లైఓవర్ల కింద, అండర్‌పాస్‌లలో వాహనాలను పార్క్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని బెంగళూరు జాయింట్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ రవికాంతె గౌడ అన్నారు. బెంగళూరులో గతవారం ఒక్కసారిగా కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో అప్పటికే రోడ్డుమీదున్న బైకర్లు సమీపంలోని దుకాణాలు, ఫ్లైఓవర్లు, మెట్రో లైన్, అండర్‌పాస్‌ల కింద తలదాచుకున్నారు. 

 

నాలుగు ప్రమాదాలు

నగరంలో ఇటీవల నాలుగు ప్రమాదాలు జరిగాయి. హై గ్రౌండ్స్, కుమారస్వామి లే అవుట్, కేఆర్ పురం, జీవన్ బీమా నగర్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ఇవి చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదాలన్నింటికీ బైకర్లు ఫ్లై ఓవర్ల కింద షెల్టర్ తీసుకోవడమే కారణమని వివరించారు. వర్షం వస్తోంది కదా అని అండర్‌పాస్‌ల కింద రక్షణ పొందితే వరద ముంచెత్తే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయని  పోలీస్ డిప్యూటీ కమిషనర్ కుల్దీప్ జైన్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-03T01:28:14+05:30 IST