వివాదాల సుడిగుండంలో Bengaluru విశ్వవిద్యాలయం

ABN , First Publish Date - 2022-03-21T17:54:47+05:30 IST

బెంగళూరు విశ్వవిద్యాలయం వివాదాల సుడిగుండంలో ఇరుక్కుంది. విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌గా డాక్టర్‌ కేఆర్‌ వేణుగోపాల్‌ నియామకం చెల్లదంటూ ఇటీవల

వివాదాల సుడిగుండంలో Bengaluru విశ్వవిద్యాలయం

- వీసీ నియామకం చెల్లదని హైకోర్టు తీర్పుతో కలకలం

- సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని వీసీ వెల్లడి


బెంగళూరు: బెంగళూరు విశ్వవిద్యాలయం వివాదాల సుడిగుండంలో ఇరుక్కుంది. విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌గా డాక్టర్‌ కేఆర్‌ వేణుగోపాల్‌ నియామకం చెల్లదంటూ ఇటీవల హైకోర్టు  ఇచ్చిన తీర్పుతో కలకలం ప్రారంభమైంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నానని వీసీ ప్రకటించారు. హైకోర్టు తీర్పు పై సుప్రీంకోర్టు స్టే మంజూరు చేస్తే వీసిగా కొనసాగుతాను, లేదంటే వైదొలగుతానని ఆయన పేర్కొన్నారు. తనను గవర్నర్‌ వీసీగా నియమించారని, ఇప్పడు ఆయన ఆదేశాలనే ప్రశ్నిస్తూ కొందరు హైకోర్టుకు వెళ్లారని దీనిపై గవర్నర్‌ నిర్ణయం కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వేణుగోపాల్‌ తెలిపారు. హైకోర్టు తీర్పు అనంతరం వీసి హోదాలో తాను ఏ ఫైల్‌ పైనా సంతకం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్ధి దశ నుంచి ఇంతవరకు దాదాపు 48 సంవత్సరాల పాటు తాను బెంగళూరు విశ్వవిద్యాలయంతో ఆత్మీయసంబంధం కలిగి ఉన్నానని, అర ్హత ప్రాతిపదికనే ఈ ఉన్నత స్థానానికి చేరుకోగలిగానని వేణుగోపాల్‌  శనివారం మీడియాకు చెప్పారు. తాను ఎక్క డా నియమాలను ఉల్లంఘించలేదన్నారు. సుప్రీంకోర్టులో తనకు న్యాయం దక్కుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కా గా హైకోర్టు తీర్పు అనంతరం కూడా వేణుగోపాల్‌ ఇంకా వీసీ పదవి నుంచి తప్పుకోకపోవడం విచిత్రం గా ఉందని సిండికేట్‌ సభ్యుడు డాక్టర్‌ హెచ్‌ సుధాకరన్‌ అభిప్రాయపడ్డారు. తక్షణం వీసీ పదవికి రాజీనామా చేసి తపుకోవాలని వేణుగోపాల్‌కు సూచించారు. లేనిపక్షంలో గవర్నర్‌ ఆయనను వీసి పదవి నుండి తొలగించాలని కోరారు. ఒక వేళ గవర్నర్‌ స్వయంగా సూచిస్తే రాజీనామా చేయాలని వీసీ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆయన రాజీనామా చేస్తే సీనియర్‌ డీన్‌ను తాత్కాలికంగా వీసీ పదవిలో నియమించే అవకాశం ఉందని విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2022-03-21T17:54:47+05:30 IST