Bengaluru వర్సిటీలో ధర్నాలపై నిషేధం

ABN , First Publish Date - 2022-02-03T17:02:40+05:30 IST

బెంగళూరు విశ్వవిద్యాలయంలో గత మూడు రోజులుగా ఏబీవీపీ, దళిత సంఘాల విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో యూనివర్సిటీ క్యాంప్‌సలో అన్ని రకాల ధర్నాలపై నిషేధం విధించారు. ఈ

Bengaluru వర్సిటీలో ధర్నాలపై నిషేధం

బెంగళూరు: బెంగళూరు విశ్వవిద్యాలయంలో గత మూడు రోజులుగా ఏబీవీపీ, దళిత సంఘాల విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో యూనివర్సిటీ క్యాంప్‌సలో అన్ని రకాల ధర్నాలపై నిషేధం విధించారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ కొట్రేష్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండటంతో ఘర్షణ వాతావరణం నెలకొని ఉందని, ఈ కారణంగానే క్యాంప్‌సలో ఇకపై ఎలాంటి ధర్నాలకు అనుమతి ఇవ్వరాదని తీర్మానించామన్నారు. ఈ మేరకు యూనివర్సిటీ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌కు కూడా సమాచారం అందించామన్నారు. క్యాంపస్‌లో ఎలాంటి ధర్నాలను అనుమతించవద్దని, ఒక వేళ ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోరామని యూనివర్సిటీ ప్రకటన పేర్కొంది.

Updated Date - 2022-02-03T17:02:40+05:30 IST