SBI: న్యాయపోరాటంలో మహిళ విజయం.. ఏకంగా రూ.54 లక్షల రుణం మాఫీ చేసిన ఎస్‌బీఐ!

ABN , First Publish Date - 2022-07-23T02:40:09+05:30 IST

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India)కు భారీ షాక్ తగిలింది.

SBI: న్యాయపోరాటంలో మహిళ విజయం.. ఏకంగా రూ.54 లక్షల రుణం మాఫీ చేసిన ఎస్‌బీఐ!

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India)కు భారీ షాక్ తగిలింది. ఎస్‌బీఐతో న్యాయపోరాటంలో బెంగళూరు (Bengaluru )కు చెందిన ఓ మహిళ విజయం సాధించింది. ఆ మహిళకు సంబంధించిన రూ. 54 లక్షల రుణాన్ని మాఫీ చేయాలని వినియోగదారుల కోర్టు (consumer court) ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరుకు చెందిన ధరణి (36 ఏళ్లు) అనే మహిళ భర్త రూపేష్ రెడ్డి కరోనా వల్ల 2021లో చనిపోయారు. రూపేష్ తీసుకున్న రూ. 54 లక్షల రుణాన్ని చెల్లించాలని ధరణిని బ్యాంక్ అధికారులు అడిగారు. దీనిపై ఆమె వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. 


ఇది కూడా చదవండి..

Shaktiman Stunt: కదులుతున్న ట్రక్ మీద పుష్ అప్స్... చివరకు ఏం జరిగిందంటే..


భర్త మరణం తర్వాత పిల్లలు, తల్లిదండ్రుల పోషణ, ఇంటి ఖర్చులకే డబ్బులు సరిపోవడం లేదని, బ్యాంక్ లోన్ కట్టడం తనకు తలకు మించిన భారం అని ధరణి కోర్టుకు తెలిపారు. తన భర్తకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బుల మీదే తమ జీవితాలు ఆధారపడి ఉన్నాయని, అయితే బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తనకు ఇన్సూరెన్స్ డబ్బులు రావడం లేదని ఆమె పేర్కొన్నారు. ఆమె వాదనపై ఎస్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. లోన్ తీసుకునే సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ బాక్సులో రూపేష్ టిక్ పెట్టలేదని, ఇన్సూరెన్స్ పాలసీ కోసం లిఖిత పూర్వకంగా అంగీకారం తెలియజేయలేదని, ప్రీమియం కట్ అయినా అది ఎస్‌బీఐ లైఫ్‌కు చేరలేదని బ్యాంక్ తెలిపింది. 


ఎస్‌బీఐ వాదనను వినియోగదారుల కోర్టు తోసిపుచ్చింది. హౌసింగ్ లోన్ ఇన్సూరెన్స్ కవరేజ్ విషయంలో బ్యాంకు సిబ్బంది సర్వీసుల లోపం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. లోన్ మంజూరు సమయంలో ఇన్సూరెన్స్ పాలసీ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకుదే అని తేల్చి చెప్పింది. ఇక, వినియోగదారులకు తెలియజేయకుండానే ఇన్సూరెన్స్‌ను క్యాన్సల్ చేయడం రూల్స్‌కు వ్యతిరేకమని తెలిపింది. అందువల్ల బ్యాంక్ రుణ మొత్తాన్ని మాఫీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే న్యాయ పోరాటం చేసిన ధరణికి ఖర్చుల కింద రూ. లక్ష పరిహారం, రూ. 20 వేలు వ్యాజ్యం ఖర్చులు కింద చెల్లించాలని ఆదేశించింది. 

Updated Date - 2022-07-23T02:40:09+05:30 IST