ATM లోంచి రూ.15 వేలు తీయబోయిన మహిళకు షాక్.. రిసిప్ట్ వచ్చింది కానీ.. డబ్బులు రాలేదు.. చివరకు..

ABN , First Publish Date - 2021-09-15T22:06:40+05:30 IST

ఆమె ఏటీఎమ్‌కు వెళ్లి రూ.15 వేలు విత్ డ్రా చేసింది.. ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్టు రిసిప్ట్ వచ్చింది..

ATM లోంచి రూ.15 వేలు తీయబోయిన మహిళకు షాక్.. రిసిప్ట్ వచ్చింది కానీ.. డబ్బులు రాలేదు.. చివరకు..

ఆమె ఏటీఎమ్‌కు వెళ్లి రూ.15 వేలు విత్ డ్రా చేసింది.. ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్టు రిసిప్ట్ వచ్చింది.. అయితే డబ్బులు మాత్రం రాలేదు.. దీంతో ఆమె హోం బ్రాంచ్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.. ఫిర్యాదు తీసుకున్న అధికారులు రోజులు గడుస్తున్నా ఈమె డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వలేదు.. దీంతో ఆమె జిల్లా వినియోగదారుల ఫోరం‌ను ఆశ్రయించింది.. కేసును విచారించిన న్యాయమూర్తి ఆమెకు ఊరట కలిగించారు.. బెంగళూరులో ఈ ఘటన జరిగింది. 


బెంగళూరుకు చెందిన సుకన్య అనే మహిళ 2019, జనవరి 21న తన విజయా బ్యాంక్ ఏటీఎమ్ కార్డు తీసుకుని.. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎమ్‌కు వెళ్లి.. రూ.15 వేలు విత్ డ్రా చేసింది. డబ్బులు కట్ అయినట్టు రిసిప్ట్ వచ్చింది కానీ, డబ్బులు మాత్రం రాలేదు. దీంతో ఆమె తన ఖాతా ఉన్న విజయా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు తీసుకున్న అధికారులు దర్యాఫ్తు అనంతరం డబ్బులు రిఫండ్ చేస్తామని చెప్పారు. అందుకుగానూ రూ.590 ఛార్జీ కూడా తీసుకున్నారు. అయితే డబ్బులు మాత్రం రిఫండ్ కాలేదు. దీంతో ఆమె డబ్బులు తీసిన ఏటీఎమ్ బ్యాంక్ ఆఫ్ బరోడాది కాబట్టి.. అక్కడకు కూడా వెళ్లి ఫిర్యాదు చేసింది. 


ఇవి కూడా చదవండి

బ్యాంకు ఖాతాలో రూ.5.5 లక్షలు జమ అయినట్టు మెసేజ్.. మోదీ వేశారనుకుని ఖర్చు పెట్టేసిన తర్వాత.




నిద్రమత్తులో బ్రష్‌పై పేస్ట్ పెట్టుకున్న యువతి.. తీరా బ్రష్ చేశాక చూస్తే.. విషాదం!


మూడు నెలలు పూర్తయినా రిఫండ్ రాకపోవడంతో సుకన్య జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. దీంతో విజయా బ్యాంక్ అధికారులు మాట మార్చారు. ఆమె ఫిర్యాదు నిజం కాదని, ఆమె రూ.15 వేలు తీసుకుని కూడా తీసుకోలేదని చెబుతోందని వినియోగదారుల ఫోరంలో కౌంటర్ వేశారు. దీంతో జడ్జి బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. సుకన్యకు ఏటీఎమ్ నుంచి రిసిప్ట్ వచ్చింది తప్ప.. డబ్బులు రాలేదని ఆ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా స్పష్టమైంది. దీంతో న్యాయమూర్తి ఈ కేసులో తీర్పునిస్తూ సుకన్యకు రూ.15 వేల రూపాయలు, వడ్డీతో కలిపి ఇవ్వాలని ఇరు బ్యాంకులను ఆదేశించారు. అలాగే నష్టపరిహారంగా రూ.3 వేలు, కోర్టు ఖర్చుల కింద రూ.2 వేలు మొత్తం రూ.5 వేలు అదనంగా చెల్లించాలని ఆదేశించారు. 


Updated Date - 2021-09-15T22:06:40+05:30 IST