కొవిడ్‌ మహమ్మారిని తరిమికొట్టిన ఇజ్రాయెల్.. తెరుచుకోనున్న రెస్టారెంట్లు

ABN , First Publish Date - 2021-03-08T00:38:41+05:30 IST

కరోనా మహమ్మారి నుంచి ఇజ్రాయెల్ దాదాపు బయటపడింది. దీంతో ఎగ్జిట్ ప్లాన్‌లో భాగంగా రెస్టారెంట్లు

కొవిడ్‌ మహమ్మారిని తరిమికొట్టిన ఇజ్రాయెల్.. తెరుచుకోనున్న రెస్టారెంట్లు

జెరూసెలం: కరోనా మహమ్మారి నుంచి ఇజ్రాయెల్ దాదాపు బయటపడింది. దీంతో ఎగ్జిట్ ప్లాన్‌లో భాగంగా రెస్టారెంట్లు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వనున్నట్టు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. అయితే, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పెరుగుతున్న కేసులు మరోమారు లాక్‌డౌన్‌కు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 23న జరగనున్న ఎన్నికల్లో కరోనా విషయంలో తాను తీసుకున్న విధానాలే తనను గెలిపిస్తాయని నెతన్యాహు ఆశగా ఉన్నారు. 


‘‘రెస్టారెంట్లు తిరిగి మన జీవితంలోకి వస్తున్నాయి’’ అని పార్క్ కేఫ్ వద్ద జెరూసెలం మేయర్ మోషె లయన్‌తో కలిసి మాట్లాడుతూ నెతన్యాహు చెప్పారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని,  భౌతికదూరం పాటించాలని సూచించారు. ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి దేశం బయటపడుతున్నట్టు పేర్కొన్నారు. 


దేశంలో ఫైజర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కాగా, 53 శాతం మంది టీకా తీసుకున్నారు. ప్రభుత్వం క్రమంగా వ్యాపారాలు, స్కూళ్లు, దేశంలోని ప్రధాన విమానాశ్రయాలను తిరిగి తెరుస్తోంది.

Updated Date - 2021-03-08T00:38:41+05:30 IST